25 కోట్ల మంది దారిద్య్ర రేఖ నుంచి బయటకు వచ్చారు
దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదని ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
25 కోట్ల మంది ఇప్పటి వరకు దేశంలో దారిద్య్ర రేఖ నుంచి బయటకు వచ్చారని, మధ్యతరగతి ఆస్పిరేషన్స్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల భవనాల శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం. దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు. నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు. అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్యూ సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయి. 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయం. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం బాధ్యత. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దు. దానిని మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలి అని అన్నారు.