మొంథా తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్స్

మొంథా తుపాను కదలికల్లో వేగం పెరిగింది. గంటకు 18 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.

Update: 2025-10-27 04:57 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ ఇప్పుడు తుఫాను 'మొంథా'గా మారింది. గడచిన 3 గంటల్లో గంటకు 16-18 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి దక్షిణ-తూర్పు దిశలో 600 కి.మీ., విశాఖపట్నంకి 710 కి.మీ., కాకినాడకి 680 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, అదే రోజు  సాయంత్రం/రాత్రి సమయంలో కానీ తర్వాత రోజు ఉదయం కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉంది.

వేగం..దిశ:

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. గరిష్టంగా 120 కి.మీ. వేగం చేరవచ్చు. 

వర్షపాతం:

ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు రెడ్/ఆరెంజ్ అలర్ట్ జారీ. సోమవారం (అక్టోబర్ 27) కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణం ప్రశాంతంగా కనిపించినా అశ్రద్ధ చేయకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అని ఆయన సూచించారు.

మొంథా ప్రభావం ఒడిశా, తమిళనాడుపై ప్రభావం ఉండనుంది.  ఒడిశాలో  అక్టోబర్ 28-29న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ 8 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా సోమ, మంగళవారాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Similar News