వీర జవాన్‌ మురళీ నాయక్‌కు సంతాపాల వెల్లువ

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు పలువురు ఏపీ మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.;

Update: 2025-05-09 13:05 GMT

దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మురళీ నాయక్‌ త్యాగం చిరస్థాయిగా గుర్తింపు పొందుతుందన్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌లో వీర మరణం పొందిన జవాన్‌ మురళీ నాయక్‌ త్యాగాన్ని భారత జాతి ఎన్నడు మరచి పోదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాటి మరణించిన మురళీ నాయక్‌ ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితాండాకు చెందిన మురళీ నాయక్‌ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులు జ్యోతి బాయి, శ్రీరామ్‌ నాయక్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఈ కుటంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.
ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధభూమిలో నేలకొరిగిన వీర జవాన్‌ మురళీ నాయక్‌ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్‌ మురళీ నాయక్‌ బలిదానం పట్ల తీవ్ర బాధ కలిగింది. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ దుఃఖ సమయంలో మేము వారితో పాటు నిలుస్తాము అంటూ సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొలుసు పార్థసారథి, సత్యకుమార్‌ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సంతాపాలు తెలిపారు.
Tags:    

Similar News