ఆంధ్రలో కమల వికాసం.. అడుగుల్లో వేగం పెంచుతుందా?

నాలుగు అడుగులతో నడక ప్రారంభించిన బిజెపి మిత్రబంధం ఊతంగా బలం పెంచుకుంది. "మోదీ పరివార్" అనే వ్యక్తి ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. ఆ పార్టీ గొంతుకలైన సంస్థలు ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి దిగాయి.

Update: 2024-06-06 12:05 GMT

రాష్ట్రంలో బిజెపి బలంగా పాదం మోపింది. పొత్తును నిచ్చెనగా చేసుకున్న కమలనాధులు అసెంబ్లీలోనే కాకుండా, ఎంపీ స్థానాల్లో కూడా పాగా వేశారు. బిజెపి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టిడిపి గొంతుకలు అయినా, సంఖ్యాపరంగా బలాన్ని పెంచుకోగలిగారు. 2014 ఎన్నికలతో పోలిస్తే బిజెపి ప్రజాప్రతినిధుల సంఖ్య రెట్టింపయింది.

వీటన్నింటి కంటే ప్రధానంగా.. "మోదీ పరివార్" గా పేరుపడిన వ్యక్తి రాయలసీమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కావడానికి ఆ మోదీపరివార్ గా మారిన వ్యక్తి వ్యూహమే ప్రతిఫలించిందనేది బిజెపి వర్గాల మాట. రానున్న కాలానికి వారి ప్రస్థానం ఏ దిశలో సాగుతుందనేది కొన్ని వర్గాలు సునిసితంగా గమనిస్తున్నాయి. అందుకు ప్రత్యేక కారణాలు కూడా లేకపోలేదు.
తాజా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత, బిజెపికి హృదయంలా పనిచేసే ఆర్ఎస్ఎస్, శరీర భాగాలుగా పనిచేసే సంఘ పరివార్ శక్తులు రాయలసీమపై దృష్టి సారించాయి. తమ సంఘాల కార్యకర్తలకు శిక్షణ పేరుతో సంసిద్ధులను చేసే పనిలో పడ్డాయి.
ఈ అంశంపై సిపిఎం చిత్తూరు జిల్లా నాయకుడు కందారపు మురళి మాట్లాడుతూ " మతాన్ని అస్త్రంగా చేసుకుని సాగే బీజేపీ వల్ల మిగతా వర్గాలు అభద్రతాభావంలో ఉన్నాయి. రాయలసీమలో కూడా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు మరింతగ దృష్టి సారించాయి అనే విషయం తెలుస్తోంది" అని మురళి వ్యాఖ్యానించారు. తమ పార్టీ వేదికలో చర్చించిన తర్వాత సమాజ హితం, పేదల పక్షాన సాగే తమ పార్టీల కార్యాచరణ ఉంటుందని మురళి వివరించారు.
బిజెపికి సదవకాశం
2024 ఎన్నికల ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి నిలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ, దక్షిణాన పట్టు బిగించాలనే లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పదేళ్ల నుంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్ల టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు బిజెపితో చేతులు కలపక తప్పని అనేవార్యమైనా పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్త తమ ప్రాబల్యాన్ని ఆంధ్రప్రదేశ్లో విస్తరించుకోవడానికి దొరికిన మంచి అవకాశాన్ని బిజెపి సద్వినియోగం చేసుకుంది. ఎలాగంటే..
బిజెపి నాలుగు అడుగులు..
2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టిడిపి రాష్ట్రంలో జనసేన, బిజెపి, పొత్తుతో ఎన్నికలకు వెళ్ళింది. తిరుపతిలో జరిగిన ఆనాటి సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. "ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10 కాదు 20 ఏళ్లు ఉండాలి అని చెప్పడంతో పాటు, ప్రత్యేక హోదా పై కూడా" హామీ ఇచ్చారు. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసించారు. దీంతో.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టిడిపి 162 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. బిజెపి 13 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో బిజెపి మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ, విశాఖపట్నం నుంచి కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలుపొందారు. వారందరూ ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బిజెపి నుంచి గెలుపొందిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందిన విష్ణుకుమార రాజు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలకు ప్రచారకర్తగా మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత అనుకోని విధంగా ఎన్డీఏ నుంచి టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకున్నారు. దీంతో..
కనిపించని కమలం...
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఒంటరిగా 175 స్థానాలకు పోటీ చేసి, 151 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. 23 స్థానాలకు మాత్రమే పరిమితమైన టిడిపి, ఒక స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ పార్టీ నుంచి తప్పుకుని, అధికార వైఎస్ఆర్సిపి గొంతు మారిపోయారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. బిజెపి, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
రెట్టించిన కమల వికాసం...
గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అనేక మార్పులకు నాంది పలికింది. అందులో ప్రధానంగా "స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరిట టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడును కర్నూలులో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడం" వంటి పరిణామాల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. చంద్రబాబును పరామర్శించడంతోపాటు రాజమండ్రి జైలు వెలుపల టిడిపికి మిత్రపక్షంగా ఉంటామని ఏకపక్షంగా ప్రకటించారు. ఆ తర్వాత బిజెపితో మైత్రి కుదరచడం ద్వారా టిడిపిని ఎన్డీఏ లో భాగస్వామి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇదే అదునుగా, బిజెపి అమాయకత్వం రంగంలోకి దిగింది. ముందస్తు వ్యూహంతో ఉన్న బిజెపికి ఆ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో తన బలం పెంచుకోవడానికి వూతంలా ఉపయోగించుకుంది. అందుకు నిదర్శనం.. రాష్ట్రంలో బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలను పక్కకు ఉంచితే. రాయలసీమలోని అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి జాతీయ కార్యదర్శి వి సత్యకుమార్ గెలుపొందారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి సి. ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. కడప జిల్లా బద్వేలు నుంచి పోటీ చేసిన బొజ్జ రోశన్న ఓటమి చెందారు. అనకాపల్లి ఎంపీగా కడప జిల్లాకు చెందిన సీఎం. రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించిన వారిలో ఉన్నారు. ఈ విజయాలతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలంగా పునాదులు వేసుకోవడానికి పావులు కలిపినట్లు కనిపిస్తోంది.
రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్
2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మూసిన తర్వాత ముందస్తు వ్యూహంతోనే ఉన్న బిజెపి కి గుండెకాయ లాంటి ఆర్ఎస్ఎస్, కాషాయ దళాలు రాయలసీమలోకి దిగాయి. దక్షిణాది రాష్ట్రాల ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలు చిత్తూరు జిల్లా మదనపల్లికి సమీపంలోని గ్రామంలో అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాయి. 600 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరైన ఈ శిబిరంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ నాలుగు రోజులు ఇక్కడే ముఖం వేసి శిక్షణ ఇచ్చారంటే వారి వ్యూహం ఏమిటో తెలియలేదు. ఇంకా ఆ శిబిరం జరుగుతూనే ఉంది.
అలాగే కర్నూలు జిల్లా అని ఓ ప్రైవేటు పాఠశాలలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర 16 జిల్లాల శిక్షణ శిబిరం నిర్వహించింది. "హిందుత్వం అజెండాగా తమ సంస్థ పనిచేస్తుందంటూ, సమాజంలో యువకుల పాత్రపై శిక్షణ ఇచ్చాం. సిద్ధాంతం సామాజిక, ధార్మిక అంశాలపై శిక్షణ కోసం సాధారణంగా జరిగే కార్యక్రమాలే" అని విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి భానుప్రకాష్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
మోదీ పరివార్...
కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన ఏ సత్యకుమార్ మదనపల్లిలో పాలిటెక్ పూర్తి చేస్తే సందర్భంలో ఏబీవీపీలో చురుగ్గా పాల్గొంటూ బిజెపి జాతీయ కార్యదర్శి హోదా ఎదిగారు. అనేక భాషను మాట్లాడగలిగిన సత్తా తోపాటు బిజెపి అగ్ర నాయకుల్లో తల్లో నాలుకలా మారారు. సత్య కుమార్ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోదీ పరివార్ అంటే వ్యక్తులు కాదు. ఇతనొక్కడే ఒకశక్తిగా ఆ పార్టీలో గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లోని సగం జిల్లాల్లో తన వ్యూహంతోనే బిజెపి అధికారంలోకి తీసుకు రాగలిగారనేది బిజెపి వర్గాల నుంచి వినిపించే మాట. రాయలసీమ ప్రాంతానికే చెందిన అంతటి వాక్ చాతుర్యం, వ్యూహం ఉన్న సత్య కుమార్ ద్వారా బిజెపి అగ్రనాయకత్వం వ్యూహాలు అమలు చేయించే అవకాశం లేకపోతేనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న కాలంలో బిజెపి రాయలసీమలో చాప కింద నీరుల విస్తరించడానికి ఎలాంటి విహాలు అమలు చేయబోతుంది అనేది వేచి చూడాలి.
ఈ పరిస్థితిపై బీజేపీ నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కరణం భాస్కరరావు స్పందించారు. "జాతీయ అంశాల ప్రాతిపదిగానే పార్టీ కార్యాచరణ ఉంటుంది. జాతి ప్రయోజనాలు కాపాడడంలో ఎలాంటి రాజీదరని ఉండదు" అని కరణ భాస్కరరావు ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు. అయితే, "ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలన్నీ ఏటా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం పరిపాటి" అని ఆయన అంటున్నారు.
Tags:    

Similar News