తల్లి కనిపించక, పాలు లేక ప్రాణం విడిచిన ఏనుగు పిల్ల

చిత్తూరు జిల్లాలో విషాదం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-24 18:32 GMT

తల్లీబిడ్డ అనుబంధం విడదీయలేనిది. వన్యప్రాణులు కూడా ఇందుకు అతీతం కాదనే సంఘటన ఇది. తల్లి ఏనుగు మరణించడంతో ఓ పిల్ల తల్లడిల్లింది. తల్లి కనిపించక, పాల కోసం అలమటించిన ఓ పిల్ల ఏనుగు ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులుగా అటవీశాఖాధికారులు ఏనుగు మృతేదేహానికి కన్నీటితో దహన సంస్కారాలు నిర్వహించారు. 

ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద జరిగింది. పంచనామా నిర్వహించిన అనంతరం అటవీశాఖ అధికారులు ఆ పిల్ల ఏనుగుకు అంతిమ వీడ్కోలు పలికారు. సంప్రదాయబద్ధంగా ఆ పిల్ల ఏనుగు భౌతికకాయం చితిమంటల్లో బూడిదగా మారింది. ఈ సంఘటన చూస్తూ అటవీశాఖ అధికారులే కాదు. గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

ఏనుగు మృతదేహాన్ని పరిశీలిస్తున్న జిల్లా అటవీశాఖాధికారి వివేక్, సిబ్బంది

"సాధారణంగా వన్యప్రాణుల్లో ఏనుగు మరణిస్తే, మందలోని మిగతా ఏనుగులు సమీప ప్రాంతంలోనే సంచరిస్తుంటాయి" అని వాటి మానసిక స్థితిని జిల్లా అటవీశాఖాధికారి వివేక్ వివరించారు.

"గత నెలలో గున్న ఏనుగు మరణించిన స్థలానికి సమీపంలోనే పిల్ల ఏనుగు మరణించడం కూడా అందుకు నిదర్శనం" అనేది డీఎఫ్ఓ వివేక్ చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన ఏనుగు పిల్ల, తల్లి కోసం, పాల కోసమే అలమటించి ప్రాణాలు వదిలిందనేది ఆయన విశ్లేషణ.

చిత్తూరు జిల్లాలో ఏనుగులు సంచారం ఎక్కువ అనేది తెలిసిన విషయమే. అడవులుకు సమీపంలోని గ్రామాల వద్ద సాకులోని పంటలు, ప్రధానంగా ఉద్యానవన పంటలపై ఏనుగులు దాడులకు దిగుతున్న విషయం సర్వసాధారణంగా మారింది. వాటిని కట్టడి చేయడానికి కుప్పం సమీపంలోని ననియాల అటవీ ప్రాంతానికి సమీపంలో రెండు కుంకీ ఏనుగులు ఉన్నాయి. వాటికి తోడుగా కర్ణాటక రాష్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఉమ్మడి చిత్తూరు జిల్తాలకు తీసుసుకుని వచ్చారు. వాటిలో రెండు కుంకీ ఏనుగులు తిరుపతి ఎస్వీ జూపార్కులో ఉండగా, మరో నాలుగు కుంకీ ఏనుగులు పలమనేరు సమీపంలోని ముసలిమడుగు క్యాంపులో ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే అటవీ ప్రాంతం నుంచి గ్రామాల వైపు దండెత్తె ఏనుగులను దారి మళ్లించడానికి ఆపరేషన్ లోకి దించుతున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా అవి రంగంలోకి దిగలేదు. ఇప్పుడిప్పుడే ట్రయల్ ఆపరేషన్ ప్రారంభించారు. శిక్షణలో ఉన్న ఆ ఏనుగులను కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన మావటీలు, ఆంధ్రా ప్రాంతం వారికి అలవాటు చేయడంలో ఇంకా ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇదిలాఉండగా..
2025 జూలై 5 : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవవర్గం కల్లూరు - సదుం మార్గంలోని చిట్టారెడ్డిపుట వద్దకు 17 ఏనుగుల మంద ప్రవేశించింది. చెరువు కట్టపై వెళ్లే సమయంలో జారీ పడిన ఓ గున్న ఏనుగు తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఏనుగు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి, ఖననం చేశారు. మిగతా ఏనుగులు సమీప ప్రాంతంలోనే మకాం వేయడంతో అటవీశాఖాధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఏనుగుల మంద దరిదాపుల్లోకి రాకుండా, జాగ్రత్తలు పాటించారు.
తల్లికోసం ఆరాటం
పిల్ల ఏనుగు మృతదేహం
మరణించిన గున్న ఏనుగు పిల్ల ఒకటి తల్లడిల్లినట్లు కనిపిస్తోంది. అటవీశాఖాధికారులు కూడా ఈ విషయంపై చూచాయనగా అవగాహనకు వచ్చారు.
ఆ రోజు గున్న ఏనుగు మరణించిన ప్రదేశానికి సమీపంలో.. కల్లూరు సమీపంలోని సైదుల్లాగుట్ట వద్ద పిల్ల ఏనుగు మృతదేహం ఉన్నట్లు గ్రామస్తుల నుంచి అటవీశాఖాధాకారులకు సమాచారం అందింది. ఆ ఘటనా స్థలానికి జిల్లా అటవీ శాఖ అధికారి (district forest officer- DFO ) వివేక్ సిబ్బందితో కలిసి చేరుకున్నారు.
2025 జూలై 5 : గున్న ఏనుగు మరణించిన ప్రదేశానికి సమీపంలోనే గున్న ఏనుగు మరణించింది. ఈ ప్రదేశాన్ని సందర్శంచిన డీఎఫ్ఓ వివేక్ పరిస్థితిని సమీక్షించారు.
"తల్లి ఏనుగు మరణించడం. పాల కోసం పిల్ల ఏనుగు మరణించి ఉండవచ్చు" అని డీఎఫ్ఓ వివేక్ అభిప్రాయపడ్డారు. సిబ్బందిని నుంచి కూడా అదే భావన వ్యక్తమైంది. గున్న ఏనుగు మరణించిన తరువాత ఏనుగుల మంద కూడా సమీప ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏనుగు పిల్ల మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎఫ్ఓ వివేక్, అటవీశాఖ సిబ్బంది,

మరణించిన పిల్ల ఏనుగుకు వెటర్నరీ డాక్టర్లు శవపంచనామా నిర్వహించారు. ఆ తరువాత ఆ ఏనుగుకు అంతిమ వీడ్కోలు పలికారు.  ఆ సమయంలో సమీప గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఏనుగుపిల్ల మృతదేహానికి బంధువులుగా మారిన అటవీశాఖాధికారులు తుది వీడ్కోలు

ఏనుగులు పంటలు ధ్వంసం చేయడంతో నష్టపోయిన రైతులు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. తల్లి ఏనుగు మరణించిన తరువాత దాని పిల్ల కూడా పరితపించి తుదిశ్వాస విడిచినట్లు అటవీశాఖ అధికారుల విశ్లేషణ తరువాత వివరాలు తెలుసుకున్న గ్రామస్తులు కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.
Tags:    

Similar News