TTD Breaking | టీటీడీ ఈఓగా మళ్లీ రానున్న సింఘాల్
స్వల్ప కాలంలోనే ఈఓ శ్యామలరావు బదిలీ.;
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈఓ జే. శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన బదిలీపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో మళ్ళీ పూర్వ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం కొద్ది సేపటి కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా,
ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈఓగా పనిచేసిన వారిలో అనిల్ సింఘాల్ మొదటి వ్యక్తి. 2022లో ఆయన కొంతకాలం ఈఓగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మళ్లీ సింఘాల్ కే సీఎం నారా చంద్రబాబు అవకాశం కల్పించారు.
2022లో బాధ్యతలు స్వీకరిస్తున్న సింఘాల్ (ఫైల్)
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో ఈఓ శ్యామలరావుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తిరుమల ఉత్తరద్వార దర్శనం కోసం వైకుంఠ ఏకాదళి సందర్భంగా టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంఘటన తెలిసిందే.
ప్రస్తుత ఈఓ జే. శ్యామలరావు