ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. దాదాపు ప్రతి పోలింగ్ బూత్ దగ్గరా ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటమే ఇందుకు కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్లు అధిక సంఖ్యలో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం మంచి పరిణామం అని అధికారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ గర్వనర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ మద్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ స్వగ్రామం అవును నియోజకవర్గం సదం మండలం ఎర్రాతివారిపల్లె లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి
ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, తప్పకుండా ఓటు వేయాలని కోరారు. pic.twitter.com/TJ5Cweb2m4
— Subbu (@Subbu15465936) May 13, 2024
ఓటరు కూడా ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, తప్పకుండా ఓటు వేయాలని కోరారు.
చిత్తూరులో దొంగఓటు కలకలం
కుప్పం నియోజకవర్గంలోని 163వ పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి వీలు లేకుండా చేస్తే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
చిత్తూరులో దొంగఓటు కలకలం
— Subbu (@Subbu15465936) May 13, 2024
కుప్పం నియోజకవర్గంలోని 163వ పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి వీలు లేకుండా చేస్తే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. pic.twitter.com/r7XNhpYFEA
హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడలో టీడీపీ కండువా వేసుకుని ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు బాలకృష్ణా. దానిపై పలువురు చర్చించుకుంటడంతో ఓటు వేసే ముందు దానిని తొలగించారు.
గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/LC6L0FAU2E
— Subbu (@Subbu15465936) May 13, 2024
కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.. విజయనగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గొలవూరులో వైఎస్ఆర్సిపి దౌర్జన్యం. పోలింగ్ బూత్ నుంచి టిడిపి ఏజెంట్లు బయటికి లాగే దాడి చేశారు. వైఎస్ఆర్సిపి మద్దతు ధరలు చేసిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు.
పవన్ కల్యాణ్‌ను చిరంజీవి విష్
జూబ్లీహిల్స్‌లోని క్లబ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.