ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

Update: 2024-05-12 23:58 GMT
Live Updates - Page 10
2024-05-13 03:13 GMT

ఓటేసిన విజయసాయి రెడ్డి

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సరిగా లేవని, ఓటర్లను క్యూ లైన్లో పంపడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు.

పోలింగ్ కేంద్రాల దగ్గర అవసరమైన స్థాయిలో పోలీసు సిబ్బంది లేరని ఆయన కలెక్టర్‌కు, జీల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

2024-05-13 03:07 GMT

గుంటూరే అత్యధికం

పోలింగ్ శాతం ఇప్పటి వరకు అత్యధికంగా గుంటూరులో నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే పదిశాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అయితే వాతావరణం చల్లగా ఉండటం ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి సహకరిస్తుందని స్థానికులు చెప్తున్నారు.

2024-05-13 03:06 GMT

ఓటు వేసిన చంద్రబాబు కుటుంబీకులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2024-05-13 03:04 GMT

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల, రెంటాల పాడు, ధూళిపాల గ్రామాల్లో పోలింగ్‌కు ముందే ఆ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్ఆర్సిపి, టిడిపి మద్దతుదారులు పరస్పరదారులకు పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత ఎన్నికల్లో కూడా ఈ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. వెంటనే స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు అదనపు బలగాలను తరలించి పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గొడవలపై కూడా ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

2024-05-13 03:00 GMT

అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

2024-05-13 02:36 GMT

విజయవాడ లయోలా కాలేజీ కేంద్రంలో కేశినేని చిన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అయితే ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో పదినిమిషాలు ఆలస్యం అయింది.

2024-05-13 02:30 GMT

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల భాకారాపురంలో కుటుంబ సభ్యులు భారతి, అవినాష్ రెడ్డితో కలిసి ఆయన ఓటు వేశారు. అంతకు ముందే అందరూ కదలి వచ్చి ఓటు వేయాలంటూ  ఓ ట్వీట్ కూడా చేశారు.

2024-05-13 02:21 GMT

అనంతపురం నగరంలో పలు చోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడమే ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెప్తున్నారు. దీనిపై పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని నేతలు కోరుతున్నారు.

2024-05-13 00:12 GMT

అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్‌ను సిబ్బంది నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ విజయవంతం అయిన తర్వాత అసలు పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అన్ని ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది తేల్చుకుని సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభిస్తారు.

2024-05-13 00:03 GMT

సర్వం సిద్ధం


పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు రాత్రే చేరుకున్న సిబ్బంది కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముగించుకున్నారు. మాక్ డ్రిల్ నిర్వహించి మరికాసేపట్లో పోలింగ్ ప్రక్రియను సిబ్బంది ప్రారంభిస్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత, క్యూలైన్లు, బ్యారికేడ్లను సిద్ధం చేశారు. 

Tags:    

Similar News