తిరుమల కేంద్రంగా యాత్రికులపై "ఏఐ నిఘా"

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-25 10:00 GMT
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం.

దేశంలో మొదటిసారి తిరుమల, కాలిబాటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence AI ) ఆధారిత రద్దీ నియంత్రణ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. తిరుమల కాలిబాటల్లో యాత్రికుల సంచారం. శ్రీవారి సన్నిధిలో క్యూలైన్ల రద్దీ. అత్యవసర పరిస్థితిని మెరుపు వేగంతో చక్కదిద్దే లక్ష్యంగా టిటిడి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (integrated command control centre)ను తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.


"యాత్రికుల రక్షణ, క్రౌడ్ మేనేజ్మెంట్ (crowd management) " కు ఈ కమాన్ కంట్రోల్ కీలకంగా వ్యవహరించే విధంగా దాదాపు 30 మంది సాంకేతిక నిపుణులును నియమించామని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి కి వివరించారు.

దేశంలో మొదటిసారి...

దేశంలో మొదటిసారి తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (Integrated Command Control Center ICCC) ఏర్పాటు చేశారు. తిరుమల వైకుంఠం1 క్యూకాంప్లెక్స్ 25వ నంబరు కంపార్టుమెంటులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నుంచి అలిపిరి నుంచే యాత్రికుల రద్దీ గుర్తించి నియంత్రించడం, వసతి కోసం భద్రత కల్పించడానికి దోహదం చేస్తుంది. రద్దీ అంచనా వేయడంతో పాటు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకంగా వ్యవహరిస్తుంది.
తిరుపతికి విస్తరించండి

తిరుమలలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం దృష్టిని టీటీడీలోని అన్ని ఆలయాలతో అనుసంధానం చేయమని ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. అంతకుముం కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని తిరుమల తో పాటు తిరుపతిలోని ఆలయాలను కూడా ఏ విధంగా పర్యవేక్షిస్తారని విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.
"యాత్రికుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆలోచన చేయడం అభినందనీయం" అని సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ నాయుడు తో పాటు అధికారులు కూడా అభినందించారు.
"శ్రీవారి దర్శనానికి క్యూలో ఉండే భక్తులకు స్వామివారి వైభవం వివరించేలా టీవీల్లో నాణ్యమైన వీడియోలు ప్రసారం చేయండి" అని సీఎం చంద్రబాబు టిటిడి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆధీనంలోని అన్ని దేవాలయాలను తిరుమల ఏర్పాటుచేసిన కమాన్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
కంట్రోల్ రూం ప్రత్యేకతలు
తిరుమలలో అత్యంత ఆధునిక యంత్ర పరికరాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు క్వాంటం రెడీ అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ తో పనిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ఆ వివరాలను టీటీడీ ఐటీ విభాగం అధికారులతో పాటు చైర్మన్ బి ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వివరించారు.
"తిరుమల తోపాటు అలిపిరి, శ్రీవారి మెట్టు గాలి బాటల్లో ఆరువేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 3d మ్యాపింగ్ పద్దతిలో ఈ ప్రాంతాలను సునిసితంగా పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో టీవీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో నడిచి వచ్చే యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తారు. తిరుమలలో లేదా టికెట్ల జారీ కేంద్రాల్లో రద్దీ పెరిగిన సందర్భాల్లో రెడ్ స్పాట్లను గుర్తించడానికి వీలు కలుగుతుంది. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి పరిస్థితిని చక్కదిద్దవచ్చు" అని తిరుమలలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పనితీరుపై టిటిడి అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో యాత్రికులు నిరీక్షిస్తూ ఉంటారు. ప్రత్యేక సందర్భాలలో తోపులాటలు ఇతరత్న ఘటనలు జరగకుండా ముందుగానే అప్రమత్తం కావడానికి ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.
Tags:    

Similar News