Cases on Chandrababu | చంద్రబాబుపై 19, రేవంత్ పై 80 కేసులు

ఎన్నికల్లో ఆయా నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ అనేక విషయాలను వెల్లడిస్తుంటుంది.;

Update: 2025-08-23 03:25 GMT
Chandrababu and Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)పై 80 కేసులుంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu)పై 19 కేసులున్నాయి. ఈవిషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమక్రటికి రిఫార్మ్స్(ఏడీఆర్)(ADR) బయటపెట్టింది. ఎన్నికల్లో ఆయా నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ అనేక విషయాలను వెల్లడిస్తుంటుంది. ఇందులో సదరు నేతల ఆస్తులు, అప్పులతో పాటు వారిపై నమోదైన కేసుల వివరాలు కూడా ఉంటాయి. నేరారోపణలపై 30 రోజులు జైలులో ఉన్నప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రుల ఉద్వాసన పలికే బిల్లుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఏడీఆర్ వెల్లడించిన రిపోర్టు ఆసక్తిగా మారింది.

దేశంలోని 30మంది ముఖ్యమంత్రులపై నమోదైన కేసుల వివరాలను వారు సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ క్షుణ్ణంగా పరిశీలించింది. 30మంది ముఖ్యమంత్రుల్లో 12మంది అంటే 40శాతం మందిపై అనేక కేసులు నమోదైనట్లు సమాచారం. అందరిలోను అత్యధికంగా రేవంత్ పై 80కేసులు నమోదవ్వగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మీద 47కేసులున్నాయి. చంద్రబాబు మీద 19 కేసులు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద 13కేసులు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీద ఐదు కేసులున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ పై నాలుగేసి కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయ్ పై రెండు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఒక కేసుంది. పదిమంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచాలు తీసుకోవటం, నేరపూరిత బెదిరింపుల్లాంటి తీవ్రమైన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ జాబితాను చూస్తే చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్ తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులే.

రేవంత్ ప్రతిపక్షనేతగా ఉన్నపుడు నమోదైన కేసులే చాలా ఎక్కువ. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో పెట్టిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతికి పాల్పడిన కేసే కాకుండా మరికొన్ని అవినీతి కేసులతో పాటు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో నమోదైన కేసులు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News