నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 6
2024-06-04 08:38 GMT

ప్రొద్దుటూరు


టిడిపి అభ్యర్థి నందాల వరదరాజుల రెడ్డి ఘనవిజయం..

22,733 వేల ఓట్ల మెజార్టీతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై గెలుపు

2024-06-04 08:37 GMT

అనపర్తిలో బీజేపీ విజయం

20,567 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి గెలుపు

భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు గెలుపు

64,037 ఓట్ల తేడాతో రామాంజనేయులు విజయం

ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపు

20,804 ఓట్ల మెజార్టీతో పయ్యావుల కేశవ్ గెలుపు

2024-06-04 08:37 GMT

శ్రీ సత్య సాయి.. పుట్టపర్తి 14 వ రౌండ్ ముగిసే సరికి పుట్టపర్తి ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి 5658 ఓట్లు ఆధిక్యం

2024-06-04 08:37 GMT

ధన్యవాదాలు తెలిపిన గౌత శిరీష


పలాస నియోజకవర్గం కూటమి అభ్యర్థి గౌత శిరీష తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఎంతటి ఘనవిజయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఒక వీడియోను తను రిలీజ్ చేశారు.


2024-06-04 08:17 GMT

లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమిదే హవా

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి.. లోక్‌సభ స్థానాల్లో కూడా తమ మార్క్‌ చూపిస్తోంది. మొత్తం 25 స్థానాలకుగానూ 16 సీట్లలో టీడీపీ, జనసేన 2 సీట్లలో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. వైసీపీ మాత్రం కేవలం 4 సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తోంది.

2024-06-04 08:07 GMT

ఏపీలో 175 స్థానాల్లో ఎవరు ఎన్నిచోట్ల ముందున్నారంటే..


టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల ముందంజ..

జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20 చోట్ల ముందంజ..

బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల ముందంజ..

మొత్తంగా 161 స్థానాల్లో కూటమి ఆధిక్యం...

14 చోట్ల వైసీపీ ఆధిక్యం...

2024-06-04 08:06 GMT

తెనాలి నియోజకవర్గం


తెనాలి లో 14 వ రౌండ్ పూర్తయ్యేసరికి జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 36,894 ఓట్లు మెజార్టీలో ఉన్నారు.

2024-06-04 08:01 GMT

చంద్రబాబుకు మోదీ ఫోన్

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆంధ్రలో కూటమి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 161 సీట్లలో విజయం సాధించే దిశగా పయనించడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు.

2024-06-04 07:59 GMT

విజయవాడ పశ్చిమ లో భారీ ఆధిక్యంతో దూసుకు పోతున్న బీజెపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఏడవ రౌండ్ ముగిసే సమయానికి 20,700 మెజార్టీ తో సుజనా హవా

2024-06-04 07:59 GMT

ఉమ్మడి తూర్పు గోదావరిలో కూటమి ప్రభంజనం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజ

Tags:    

Similar News