నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 16
2024-06-04 04:31 GMT

లావు కృష్ణదేవరాయలు ఆధిక్యం...

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు...

ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 6316 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు....

మొత్తంగా లావుకు 54733 ఓట్లు, అనిల్ కు 48417ఓట్లు పోలయ్యాయి.

2024-06-04 04:30 GMT

రాయలసీమలో ఊహించని పరిణామాలు

డోన్, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, రాజంపేట ఎంపీ, పుంగునూరు, పలమనేరు స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యం, చంద్రగిరి, నగిరిలో టీడీపీ ఆధిక్యం

రాయలసీమలో మంత్రులు అందరూ ఓడిపోయే అవకాశం

విశాఖలో భరత్ ఆధిక్యం.

2024-06-04 04:30 GMT

బాపట్లలో వేగేశన నరేంద్ర వర్మ ముందంజ


టిడిపి 17,735

వైయస్‌ఆర్‌సి‌పి: 14384

కాంగ్రెస్ :664

2024-06-04 04:26 GMT

సెంచ‌రీ మార్క్ దాటిన కూట‌మి...


ప్ర‌తి జిల్లాలోనూ కూట‌మిదే ఆధిక్య‌త‌

రాయ‌ల‌సీమ‌లోనూ వెనుక‌బ‌డ్డ వైసీపీ

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోనూ 3 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ కూట‌మిదే ఆధిక్య‌త

2024-06-04 04:25 GMT

నెల్లూరు జిల్లాలో టిడిపి అభ్యర్థులుగూడూరు, సులూరుపేట నెలవల విజయశ్రీ, నెల్లూరు సిటీ నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతి, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ, కావలి దగ్గు మాటి వెంకటేశ్వర్లు ఆదిత్యలో ఉన్నారు. ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు

2024-06-04 04:24 GMT

ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు

ఓటమిదిశగా మంత్రులు, మాజీ మంత్రులు.. ఫలితాల్లో వెనకబడ్డ మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజ

2024-06-04 04:24 GMT

పులివెందులలో 5,175 ఓట్ల ఆధిక్యంలో సీఎం వైఎస్‌ జగన్‌

2024-06-04 04:23 GMT

మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

2024-06-04 04:20 GMT

గుంటూరు తూర్పులో టీడీపీ హవా

నసీర్ అహ్మద్ - 10,730

నూరీఫాతీమా - 6,618

4,111 ఆధిక్యంలో మొహ్మద్ నసీర్

2024-06-04 04:19 GMT

జగన్ మాత్రమే ముందంజ

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఆధిక్యతలో ఉండగా, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా లీడ్ లో ఉన్నారు. నగరిలో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్, కుప్పంలో ఎన్ చంద్రబాబు నాయుడు, పూతలపట్టులో జర్నలిస్ట్, టిడిపి అభ్యర్థి మురళి, గంగాధర నెల్లూరు లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా ణి పై టిడిపి అభ్యర్థి థామస్ లీడ్ లో ఉన్నారు

Tags:    

Similar News