పిఎస్ఎల్వి c60 రాకెట్ . సోమవారం రాత్రి 9.48 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. Pslv c60 రాకెట్ లో అమర్చిన రెండు చిన్న ఉపగ్రహాలతో పాటు మరో 24 చిన్న ఉపకరణాలు నింగిలోకి ప్రవేశపెట్టారు. దీనివల్ల అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చెందిన దేశాల సరసన శాస్త్ర సాంకేతిక రంగంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేసినట్లు అయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వీసీ 60 రాకెట్ ప్రత్యేకతలు ఇవి. 229 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్ 44.5 మీటర్ల ఎత్తు తో రూపకల్పన చేశారు. ఇందులో 480 కిలోల బరువు కలిగిన చార్జర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు అదనంగా 24 చిన్న ఉపగ్రహాలను కూడా పిఎస్ఎల్వీ సి 60 ద్వారా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి దిగ్విజయంగా లాంచ్ చేశారు. 2000 పాటు అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఈ బుల్లి ఉపగ్రహాలు సేవలు అందించనున్నాయి. నింగిలోకి తీసుకువెళ్లింది