గోవా నైట్‌క్లబ్‌: అగ్నిప్రమాద సమయంలో లూత్రాస్ సోదరులు ఎక్కడున్నారు?

చాలా తక్కువ సమయంలో థాయిలాండ్‌కు ఎలా పారిపోయారు? అసలు క్లబ్ నిర్వహణకు అనుమతులున్నాయా?

Update: 2025-12-14 10:50 GMT
Click the Play button to listen to article

గోవా(Goa) నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో అగ్నిప్రమాదం(Fire Accident) జరగడంతో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. అసలు క్లబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు.


ఢిల్లీలో లూత్రా సోదరులు..

ఘటన జరిగిన సమయంలో సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా సోదరులు ఢిల్లీ(Delhi)లో ఓ వివాహ వేడుకలో ఉన్నారు. విషయం తెలియడంతో పెళ్లి మండలం నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయానికి ఫోన్ చేశారు. థాయిలాండ్‌కు టిక్కెట్లు బుక్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తర్వాత వారి సహాయకుడు భరత్ కోహ్లీకి ఫోన్ చేసి వెంటనే తమ ఆఫీసుకు వెళ్లి..కొన్ని డాక్యుమెంట్లను తీసుకుని ముఖర్జీ నగర్‌లోని తమ నివాసానికి రావాలని చెప్పారు. తర్వాత కొన్ని గంటల్లోనే లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లిపోయారు. లుక్ అవుట్ నోటీసుతో వారిని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారు థాయిలాండ్‌కే ఎందుకు వెళ్లాలనుకున్నారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లూథ్రా సోదరులలో ఒకరికి దీర్ఘకాలిక UK వీసా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


ఢిల్లీకి చేరుకున్న అజయ్ గుప్తా..

క్లబ్ మరో పార్ట్‌నర్ అజయ్ గుప్తాను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు అతను గోవాలో ఉన్నాడని గుర్తించారు. క్లబ్ మేనేజర్ ప్రియాంషును కూడా పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ప్రియాంఘనే గుప్తాకు అగ్ని ప్రమాదం గురించి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో గుప్తా వెంటనే గుప్తా దబోలిమ్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కాడు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఆయన తన కారు డ్రైవర్‌తో కలిసి టయోటా ఇన్నోవాలో తన గురుగ్రామ్ నివాసానికి వెళ్లాడు. అనంతరం గుప్తా తన మొబైల్ ఫోన్ స్విచ్ చేశాడు. కాని పోలీసులు అతని డ్రైవర్ ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్‌లో హాస్పిటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టును తప్పించుకోడానికి గుప్తా ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకున్న పోలీసులు తర్వాత అతని అదుపులోకి తీసుకున్నారు.


క్లబ్‌లో భద్రతా లోపాలు..

అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. క్లబ్‌లో భద్రత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. క్లబ్‌లో అగ్నిమాపక యంత్రాలు, అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడాన్ని గమనించారు. క్లబ్‌కు వెళ్లే దారి కూడా చాలా ఇరుకుగా ఉందని తేల్చారు. అవసరమైన అనుమతి పత్రాలేమీ లేకుండానే క్లబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News