'బోగస్ ఓటింగ్‌కు ఆధారాలు చూపుతా’
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్..;
ప్రధాని మోదీ (PM Modi)పై, ఎలక్షన్ కమిషన్(EC)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi)విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో మోసపూరితంగా విజయం సాధించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని, కర్ణాటకలోని ఒక లోక్‌సభ నియోజకవర్గమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. దొంగ ఓట్లు ఎలా సాధ్యమో దేశ ప్రజల ముందు, ఎన్నికల కమిషన్ ముందు రుజువు చేస్తానని చెప్పారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇప్పుడు బీహార్‌లో SIR పేరుతో మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని కోరినా.. ఈసీ మా మాట పట్టించుకోవడం లేదన్నారు. భారత్-పాక్ మధ్య సీజ్‌ఫైర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకుంటుంటే మోదీ ఒక్కసారైనా ఖండించలేదన్నారు.