‘బీహార్‌లో ఒకే ఇంట్లో ఓటర్ల సంఖ్య 947’

ఎలా సాధ్యమని ఈసీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ;

Update: 2025-08-29 08:10 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల కమిషన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. తన పార్టీ సోషల్ మీడియా షేర్ చేసిన ఓ పోస్ట్‌కు.."ఈసీ(EC) మాయాజాలం చూడండి. గ్రామం మొత్తం ఒకే ఇంట్లో స్థిరపడింది" అని కోట్ చేశారు.


ఒకే ఇంట్లో 947 మంది ఓటర్లు..

గయా జిల్లా బరాచట్టి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నిదాని గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రంలోని "మొత్తం 947 మంది ఓటర్లు" "ఆరో నంబర్ ఇంటి నివాసితులు"గా చూపడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత తప్పుబట్టారు.


స్పందించిన ఈసీ..

అయితే రాహుల్ ఆరోపణలపై బీహార్(Bihar) ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం స్పందించిది. "వాస్తవంగా సీరియల్ నంబర్లు లేని గ్రామాలు లేదా మురికివాడల్లో తాత్కాలిక ఇంటి నంబర్లను కేటాయిస్తారు. ఓటర్లను చేర్చుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి ఇలా చేస్తారు" అని కౌంటర్ ఇచ్చింది.

ప్రస్తుతం రాహుల్ బీహార్‌లో 'ఓటర్ అధికార్ యాత్ర' నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. S.I.Rకు వ్యతిరేకంగా ఆయన యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు 20 జిల్లాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో మేగా ర్యాలీతో ముగుస్తుంది. 

Tags:    

Similar News