తెలుగోళ్ళకి 'వక్ఫ్' బిల్లు కమిటీలో చోటు

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

By :  Vanaja
Update: 2024-08-09 15:14 GMT

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఇది రాజ్యాంగ విరుద్దమని తప్పుబడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో మాఫియా తయారవుతోందని ఆరోపించింది. దీనిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వాదించింది. ఈ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని చెబుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులుంటారని తెలిపారు. వాళ్ల పేర్లను వెల్లడించారు. అయితే అధికార పక్షంలోని నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులనూ ఇందులో సభ్యులుగా చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 21 మంది సభ్యుల్లో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణకు కూడా చోటు దక్కింది. ఏపీ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా కమిటీ సభ్యుల్లో ఉన్నారు. అదనంగా ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు కూడా ఉంటారని తెలిపారు. కిరణ్ రిజిజు ప్రతిపాదనను సభ్యులు ఆమోదించారు.

కాగా, ఈ కమిటీ బిల్లుని పూర్తి స్థాయిలో సమీక్షించనుంది. ఇప్పటికే ఈ బిల్లుకి బీజేపీ మిత్ర పక్షాలు పూర్తి మద్దతును తెలిపాయి. ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బిల్లులో కాంగ్రెస్ తప్పుల్ని సరిచేస్తున్నామని సమర్ధిస్తోంది. వక్ఫ్ బోర్డు విషయంలో కాంగ్రెస్ చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ ప్రతిపాదనలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ చేసినవేనని, ఇప్పుడు తాము అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పుకొస్తున్నారు.

వక్ఫ్ బోర్డుల పరిధిలో లక్షల ఎకరాలున్నాయని, వీటి మాటున పెద్ద మాఫియా తయారవుతోందని, ఆ మాఫియాని కంట్రోల్ చేయడమే తమ ఉద్దేశ్యమని కిరణ్ తెలిపారు. ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో నిఘా పెట్టే అధికారం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేశామని చెబుతోంది. అలాగే వివాదాస్పద భూములను పరిశీలించడంతో పాటు వాటి పరిష్కార బాధ్యత కలెక్టర్లకే అప్పగించాలని నిర్ణయించింది. దీంతో అవి ప్రభుత్వ భూములా లేక వక్ఫ్ ఆస్తులా అనేది కలెక్టర్లు తేల్చాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసి, అందులో ముస్లిం మహిళలకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది. ముస్లిమేతరులనూ సభ్యులుగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

జేపీసీ లోక్ సభ సభ్యులు...

1.జగదాంబిక పాల్

2. డా. నిషికాంత్ దూబే

3. తేజస్వి సూర్య

4. అపరాజిత సారంగి

5. సంజయ్ జైశ్వాల్

6. దిలీప్ సైకియా

7. అభిజిత్ గంగోపాధ్యాయ

8. డీకే అరుణ

9. గౌరవ్ గగోయ్

10. ఇమ్రాన్ మసూద్

11. మహమ్మద్ జావేద్

12. మోహిబుల్లా

13. కళ్యాణ్ బెనర్జీ

14. ఏ. రాజా

15. లావు శ్రీకృష్ణ దేవరాయలు

16. దిలేశ్వర్ కమైత్

17. అరవింద్ సావంత్

18. మాత్రే బాల్యా మమ సురేష్ గోపినాథ్

19. నరేష్ గణ్ పథ్ మాస్కె

20. అరుణ్ భార్తీ

21. అసదుద్దీన్ ఒవైసీ

జేపీసీ రాజ్యసభ సభ్యులు :

1.బ్రిజ్ లాల్

2.మేధా విశ్రామ్ కులకర్ణి

3.గులామ్ అలి

4.రాధా మోహన్ దాస్ అగర్వాల్

5.సయ్యద్ సజీర్ హుస్సేన్

6.మొహమ్మద్ నాదిముల్ హక్

7.విజయసాయి రెడ్డి

8.మొహమద్ అబ్దుల్లా

9.సంజయ్ సింగ్

10ధర్మస్థల వీరేంద్ర హెగడే

Tags:    

Similar News