Telangana | పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత డిజిటల్ విద్య
తెలంగాణలో విద్యా ప్రమాణాల పెంపునకు పాఠశాల విద్యలో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ‘ఈఎక్ స్టెప్-ఫౌండేషన్’ సేవలు...;
By : Shaik Saleem
Update: 2025-01-30 14:37 GMT
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో పాఠశాల విద్యను నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి గాను ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (ఏ.ఐ ), డిజిటల్ ఇనీషియేటివ్స్ లను పాఠశాల విద్యా శాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో మెరుగైన అభ్యాస పద్దతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టనున్నారు.
- బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులున్నారు.
- ఎక్ స్టెప్- ఫౌండేషన్ - విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయినా నందన్ నీలేకని ఈ ఎక్ స్టెప్-ఫౌండేషన్ కు కో-ఫౌండర్ గానూ ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తోంది.