Telangana | హిమాచల్ ప్రదేశ్‌లో తెలంగాణ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై తెలంగాణ ఆసక్తి వ్యక్తం చేసింది.;
By : Shaik Saleem
Update: 2025-01-30 14:17 GMT
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ సామర్థ్యం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిల్డ్ ఒన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో డ్రైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించనుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ సఖుతో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు.
త్వరలో ఒప్పందం
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్(బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించి, ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసి త్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ సఖుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యుత్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణ
హిమాచల్ లో సెలీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (400 మెగావాట్లు) మియర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (120 మెగావాట్లు) ప్రాంతాలను తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. తమ అధ్యయనంలో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేయాలని సిఫారసు చేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి,హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ లేఖ
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా అధికారికంగా ఒక లేఖను సమర్పించింది.ఈ సందర్భంగా ఎంఓయూ ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎం కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి, త్వరితగతిన ఒప్పందంపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయనున్నారు.
Telangana takes a big step in strengthening its power sector!
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 30, 2025
Met with Himachal Pradesh CM Shri @SukhuSukhvinder ji to formally express Telangana’s interest in the SELI (400 MW) & MIYAR (120 MW) Hydel Power Projects.
We have requested the Himachal Govt to share a draft MoU for… pic.twitter.com/4DV5xWewBm