ఎవరీ ప్రణీత్? వివాదం ఎక్కడికి దారితీసింది?
ప్రణీత్ హనుమంతు బ్యాచ్ అంతా కలిసి ఒక టాపిక్ తీసుకుని రోస్టింగ్, డార్క్ కామెడీ చేస్తుంటారు.
ప్రణీత్ హనుమంతు అనే ఓ యూట్యూబర్ తన ఛానల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో అతని అరెస్టుకి దారితీసింది. తండ్రీకూతుళ్ల బంధంపై అతను చేసిన అసభ్యకర కామెంట్స్ నెటిజెన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యేలా చేసింది. అతనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్స్ మొదలయ్యాయి. చివరికి ఆ వీడియో ప్రణీత్ హనుమంతు అరెస్టుకి కూడా దారి తీసింది. అసలు ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఎందుకు వివాదం అయింది. నెటిజన్లు ఏమని ఉద్యమం చేశారు? ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడింది? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం.
వీడియో.. వివాదం..
ప్రణీత్ హనుమంతు ఓ ప్రముఖ యూట్యూబర్. ఇతని ఛానల్ కి దాదాపు రెండు లక్షల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అయితే ఇతను చేసిన వీడియో వివాదం అవడంతో సబ్‌స్క్రైబర్‌లు వెనక్కి వెళ్లిపోతున్నారు. కాగా, ప్రణీత్ హనుమంతు ఈ ఛానల్ లో తనతోపాటు ఇద్దరుముగ్గురు సభ్యులతో కలిసి లైవ్ స్ట్రీమ్ లో రివ్యూలు చేస్తుంటాడు. ప్రణీత్ బ్యాచ్ అంతా కలిసి ఒక టాపిక్ తీసుకుని రోస్టింగ్, డార్క్ కామెడీ చేస్తుంటారు. ఇది నిర్వహించేది, ఛానల్ ఓనర్ ప్రణీత్ హనుమంతునే. మీమ్స్, రీల్స్, మూవీస్, సెలెబ్రిటీలు, ఇతర యూట్యూబర్స్, వైరల్ వీడియోలు.. ఇలా ఒకటేమిటి ప్రపంచంలోని అనేక అంశాలపైన వీళ్ళు డార్క్ కామెడీ చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఇది సహజంగా అనిపించొచ్చు. కానీ మనదేశంలో ఇలాంటి కంటెంట్ ని యాక్సెప్ట్ చేయడం కష్టం. అందులోనూ తండ్రీకూతుళ్ళు, అన్నాచెల్లెళ్ల రిలేషన్ కి అశ్లీలత యాడ్ చేసి డార్క్ కామెడీ అంటే సహించలేరు. ఇప్పుడు ప్రణీత్ చేసింది అదే. తండ్రీకూతుళ్ల అనుబంధంపై అతను చేసిన అసభ్యకర వీడియో వివాదాస్పదంగా మారింది.
ప్రణీత్ బ్యాచ్ అంత కలిసి తండ్రీకూతుళ్ల రీల్ పై రివ్యూ పేరిట చేసిన వీడియో అందరికీ కోపం తెప్పించింది. వీళ్ళు రివ్యూ చేసిన రీల్ అసలు సారాంశం ఏమిటంటే... చిన్నపిల్లలు ఇష్టం లేదనే వ్యక్తి కూతురు పుట్టగానే ఎంత ప్రేమగా చూసుకుంటాడు అని. అయితే ఆ రీల్ లో ఉంది నిజమైన తండ్రీకూతుళ్లా లేక ఆ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేశారా తెలియదు. కానీ సుమారు 35 నుంచి 40 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తండ్రిలా, నాలుగు నుంచి ఐదేళ్లు ఉన్న చిన్న పాప కూతురిలా రీల్ లో యాక్ట్ చేసింది. ఈ రీల్ క్యాప్షన్ లో "నాకు పిల్లలంటే ఇష్టం లేదు, కానీ అదే నేను కూతురు పుట్టిన తర్వాత" అని తెలుగులో అర్ధం వచ్చేలా ఇంగ్లీష్ లో రాసి ఉంది. ఇక రీల్ లో తండ్రి సీరియస్ గా తన నడుముకి ఉన్న బెల్ట్ తీస్తాడు. అది చూసి కొడతాడేమో అని కూతురు భయపడుతుంది. కానీ తండ్రి ఆ బెల్టుని ఉయ్యాలలా చేసి, కూతురుని కూర్చోబెట్టి ఊపుతాడు. తక్కువ నిడివితో ఉన్న ఈ వీడియోలో తండ్రీకూతుళ్ల ఆప్యాయతని అద్భుతంగా చిత్రీకరించారు.
అయితే, ఈ రీల్ పై ప్రణీత్ తన గ్రూప్ లోని ముగ్గురు యువకులతో కలిసి లైవ్ స్ట్రీమ్ లో రివ్యూ చేశాడు. సెక్సువల్ కాంటెక్స్ట్ లో ఒపీనియన్స్ చెప్పమన్నాడు. దీంతో బ్యాచ్ అంతా కలిసి ఈ రీల్ పై అశ్లీల పదజాలంతో జుగుప్స కలిగించేలా అసభ్యకర కామెంట్స్ చేశారు. ప్రణీత్ కూడా అలానే కామెంట్స్ చేస్తూ, ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవే కాదు, తాను అనేకమందిపైన ఇలానే అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇన్స్టా లో పాపులర్ అయిన నాలుగేళ్ల చిన్నారి, తన తండ్రితో కలిసి ఉన్న రీల్ పైన కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అతను కామెడీ పేరిట చేసిన వల్గర్ కామెంట్స్ అన్నీ బయటకి వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఉద్యమం...
ప్రణీత్ చేసిన ఈ వీడియోపై అనేకమంది నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ప్రణీత్ హనుమంతు రోజురోజుకీ దిగజారి వీడియోలు చేస్తున్నాడని నెట్టింట మండిపడ్డారు. వీడియో క్లిప్స్ ట్విట్టర్ లో షేర్ చేసి తండ్రీకూతుళ్ల అనుబంధంపై అసభ్యకర కామెంట్స్ చేశారని, వీడియోలో చైల్డ్ అబ్యూస్ జరిగిందని పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్యులు, జర్నలిస్టులు, ప్రముఖులు, సెలెబ్రిటీలు స్పందించారు. హీరో సాయి ధరమ్ తేజ్ ప్రణీత్ హనుమంతు చేసిన వీడియో చాలా దారుణమని, ఇలాంటివారిని క్షమించకూడదని, తగిన చర్యలు తీసుకోవాలని.. తెలుగు రాష్ట్రాల సీఎంలను, మంత్రులను, పోలీసులను ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు. దీంతో నెటిజెన్ల ఉద్యమానికి మరింత బలం చేకూరింది. అనేకమంది సినీతారలు దీనిపై స్పందించారు. చైల్డ్ అబ్యూస్ ని అరికట్టాలని కోరారు.
సాయి ధరమ్ తేజ్ చేసిన అభ్యర్థనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క స్పందించారు. మా ప్రభుత్వంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తామని, ముఖ్యంగా చిన్నపిల్లల సంరక్షణలో మరింత అప్రమత్తంగా ఉంటామని సీఎం, ఇతర మంత్రులు చెప్పారు. విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు తేజ్ కి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు సూచించారు. దీంతో తెలంగాణ డీజీపీ, విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదు చేశామని, అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రణీత్ హనుమంతుకి 14 రోజుల రిమాండ్..
ఈ నెల 10 న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీఎవరీ ప్రణీత్? వివాదం ఎక్కడికి దారితీసింది?సులు బెంగుళూరులో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి తీసుకొచ్చి గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. పోలీసులు ప్రణీత్‌పై పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని 67బీ, 79 సెక్షన్, ఐపీసీ సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారురు. మరో ముగ్గురు నిందితులపైనా కేసులు నమోదయ్యాయి. ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణ పేర్లను చేర్చారు.
ఎవరీ ప్రణీత్ హనుమంతు..?
ప్రణీత్ హనుమంతు ఏపీకి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడు. అతని తల్లి కూడా ప్రముఖ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నారు. సొసైటీలో పేరున్న కుటుంబం. దీంతో ప్రణీత్ తల్లిదండ్రుల అండ చూసుకునే, ఎవరూ తనని ఏం చేయలేరన్న ధైర్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ప్రణీత్ హనుమంతు పూణే సింబయోసిస్ లా స్కూల్ లో లా చదివాడు. కాగా, తాను తప్పు చేస్తే తననే తిట్టమని, పేరెంట్స్ ని ఇందులోకి లాగొద్దని ట్విట్టర్ లో హనుమంతు ఒక పోస్ట్ పెట్టాడు. నేను మంచి కొడుకుని కాకపోవచ్చు, కానీ వాళ్ళు గొప్ప పేరెంట్స్ అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో డార్క్ కామెడీ చేశానని, అందరికి నచ్చకపోవచ్చని, దీన్ని వేరేలా చూపిస్తున్నారని వీడియోలో చెప్పాడు. చైల్డ్ అబ్యూస్ చేయాలని తన ఉద్దేశం కాదన్నాడు. ప్రస్తుతం అతను చేసిన వివాదాస్పద వీడియో ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో లేదు.