‘‘చర్చకు మేము రెడీ.. నీకా దమ్ముందా’’.. హరీష్‌కు జగ్గారెడ్డి ఛాలెంజ్

తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రైతు రుణమాఫీ రణరంగం నడుస్తోంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇరు వర్గాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

Update: 2024-10-05 11:30 GMT

తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రైతు రుణమాఫీ రణరంగం నడుస్తోంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇరు వర్గాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఓట్ల కోసం రైతన్నలను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు అతి త్వరలోనే ఖాతాల్లో డబ్బులు జరమ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ విషయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ రణరంగంలోకి తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ రణరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. రైతు రుణమాఫీపై చర్చలకు తాము సిద్ధమని దమ్ముకుంటే హరీస్ రావు తన ఛాలెంజ్‌ను స్వీకరించాలని, చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాకపోతే ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీస్ రావుకు ఓ చాలెంజ్ కూడా చేశారు. రుణమాఫీపై చర్చలకు దమ్ముంటే హరీష్ రావు.. కేసీఆర్‌ను తీసుకురావాలని జగ్గారెడ్డి సవాళ్ విసిరారు.

కేసీఆర్ రావాలి.. తేగలవా హరీష్

రైతు రుణమాఫీ అన్న అంశంపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరి బీఆర్ఎస్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఈ చర్చలకు సీఎం రేవంత్ రెడ్డిని కాళ్లాఏళ్లా పడైనా తాను తీసుకొస్తానని, అలాగే హరీస్ రావు కూడా ఏ ఎల్లయ్యానో, పుల్లయ్యనో కాదని కేసీఆర్‌ను చర్చలకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ దమ్మున్న రోజున హరీష్ రావు విమర్శలు చేయాలని హెచ్చరించారు. కాగా జగ్గారెడ్డి ఛాలెంజ్, విమర్శలపై హరీష్ రావు ఇంకా స్పందించలేదు. కానీ రైతులకు తాము అండగా ఉంటామని, ప్రతి రైతుకు రుణమాఫీతో పాటు పంటలకు రూ.500 బోనస్ వచ్చే వరకు పోరాడతామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చేస్తాం. అది సాధించే వరకు నేను నిద్రపోను. రేవంత్ రెడ్డిని కూడా నిద్రపోనివ్వను. అన్నం పెట్టే రైతులను మోసం చేయడం ఎంత వరకు సమంజసం కాదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు నాట్లు వేసే సమయంలోనే రైతుబంధు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పంట కోతలకు వచ్చినా ఇంకా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కడుపు నిండా కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాత్రి సమయంలో కరెంటు ఇస్తుంది’’ అని చెప్పారు.

అదే రోజు నేనూ దీక్ష చేస్తా

హరీష్ రావు.. రుణమాఫీ అంశంపై ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని, రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు. కానీ అసలు ముట్టడించాల్సింది కేసీఆర్ ఇంటిని. రైతులకు నిజమైన మోసం చేసింది కేసీఆర్. కాబట్టి దీక్ష చేయాల్సింది ఆయన ఇంటి ముందు. తెలంగాణ ప్రజలను, రైతులను మోసం చేసినందుకు నేను కేటీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా. ఢిల్లీలో హరీష్ రావు తన దీక్షను ప్రారంభించిన రోజే నేను కూడా కేసీఆర్ ఇంటి ముందు దీక్ష స్టార్ట్ చేస్తా. అందులో డౌట్ లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటారో ఒక క్లారిటీ ఉంది. కానీ కేసీఆర్ ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన పార్టీ నేతలకే కేసీఆర్ పతా తెలీదు. అయినా తెలుసుకుని వెళ్లి మరీ దీక్ష చేస్తా’’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జగ్గా రెడ్డి.

ఇప్పుడు గుర్తొచ్చిందా..

‘‘హరీష్ రావుకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నది ఎవరో కానీ ఆ డైలాగులకు డిక్ష్నరీలో కూడా అర్థాలు ఉండవు. కేసీఆర్‌ది రైతు గుండె అని వాళ్లకు తొమ్మిదేళ్ల తర్వాత గుర్తొచ్చిందా. మల్లన్న సాగర్ రైతులు వీపులు పగలగొట్టినప్పుడు ఆ రైతు గుండె ఏమైంది? ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు రైతు గెండెను కేసీఆర్ ఫ్రిడ్జ్‌లో పెట్టారా? సంగారెడ్డికి కేసీఆర్ వస్తే అడ్డుకుంటా అని అంటేనే హరీష్, కేటీఆర్ రాలేదు. కాంగ్రెస్‌లో అందరూ తోపులే. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఆయుధం లాంటి నేత ఉన్నారు. ఎన్నో ఆటుపోటులను ఎదర్కొని నిలబడ్డోళ్లం. మమ్మల్ని అడ్డుకోవడం కేటీఆర్ వల్ల కాదు’’ అంటూ జగ్గా రెడ్డి రెచ్చిపోయారు.

రుణమాఫీ కాలేదు.. ఒప్పుకుంటా!

‘‘చెప్పిన స్థాయిలో రైతులకు రుణమాఫీ అందించలేక పోయాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని మేమే చెప్తున్నాం. కొందరు రైతులకు ఏ కారణాల వల్ల రుణమాఫీ కాలేదు అన్న వివరాలను తెప్పించుకుని మరీ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ రుణమాఫీపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారాయన. రుణమాఫీపై చర్చకు రేవంత్ రెడ్డిని ఒప్పించి నేను తీసుకొస్తా. కేసీఆర్‌ను ఓకే అనిపించిని తీసుకొచ్చే దమ్ము, ధైర్యం నీకున్నాయా హరీష్. అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా భయమంటే సిద్దిపేటలోనే చర్చ పెడదాం. కాంగ్రెస్ పబ్లిసిటీలో ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ ఆ ఒక్క విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అంతే.. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదన్నరేళ్లలో ఎనిమిది విడతల్లో రైతులకు లక్ష రూపాయాల రుణమాఫీ చేయలేకపోయారు. ఎందుకో కాస్త చెప్తారా హరీష్’’ అంటూ చురకలంటించారు.

Tags:    

Similar News