ఉత్తరాది వారు మూడో భాషగా ఏం నేర్చుకుంటున్నారు: స్టాలిన్
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీపై మరోసారి విమర్శలు గుప్పించిన తమిళనాడు సీఎం;
By : Praveen Chepyala
Update: 2025-03-04 07:58 GMT
జాతీయ విద్యావిధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మరోసారి స్పందించారు. తమిళనాడులో హిందీ నేర్చుకోమని బలవంతం చేయవద్దని కోరారు. ఉత్తర భారతీయులను తమ భాషను నేర్చుకోవడాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ బలవంతం చేయలేదని అన్నారు.
తమిళ ప్రచార సభల గురించి ఎప్పుడైనా విన్నారా?
దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకోవడానికి సాయం చేయడానికి ఏర్పాటు చేసిన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభను ఉదాహారణగా ఉటంకిస్తూ ఉత్తర భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు తమ భాషను రుద్దడానికి ఇష్టపడనందున అలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదని స్టాలిన్ అన్నారు.
‘‘దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకోవడానికి దక్షిణ భారత హిందీ ప్రచార సభను ఏర్పాటు చేసి ఒక శతాబ్ధం గడిచింది. ఈ సంవత్సరాలలో ఉత్తర భారతదేశంలో ఎన్ని తమిళ ప్రచార సభలు స్థాపించబడ్డాయి’’ అని ప్రశ్నించారు.
నిజం ఏంటంటే.. ఉత్తర భారతీయులు తమను సంరక్షించుకోవడానికే తమిళం లేదా ఏదైన దక్షిణ భారత భాషను నేర్చుకోవాలని మేము ఎప్పుడూ డిమాండ్ చేయలేదు’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి..
‘‘మాపై హిందీ విధించడాన్ని ఆపమని మేము అడుగుతున్నాము. బీజేపీ పాలిత రాష్ట్రాలు మూడు లేదా 30 భాషలను నేర్పించాలనుకుంటే వారిని అనుమతించండి. తమిళనాడును ఒంటరిగా వదిలేయండి’’ అని డీఎంకే చీఫ్ అన్నారు.
తమిళనాడు భాషా ఉద్యమంపై రాష్ట్ర యువతకు అవగాహాన కల్పించడానికి డీఎంకే మౌత్ పీస్ మురసోలీ ప్రారంభించిన ప్రచార యుద్దంలో స్టాలిన్ తన వాదన కూడా ఉంది.
ఉత్తరాదిలో మూడో భాష లేదు..
దక్షిణాదిలోని విద్యార్థులు మూడో భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని స్టాలిన్ ప్రశ్నించిన తరువాత ఈ పోస్ట్ చేశారు. ఉత్తరాదిలో మాత్రం కేవలం రెండు భాషలు మాత్రమే ఉన్నాయని కానీ దక్షిణాది వారికి మాత్రం మూడు భాషలు ఎందుకన్నారు.
‘‘కొంతమంది వక్ర విధానాల సంరక్షకులు తీవ్ర ఆందోళనతో తమిళనాడు విద్యార్థులకు మూడో భాష నేర్చుకునే అవకాశాన్ని మీరేందుకు నిరాకరిస్తున్నారని అడుగుతున్నారు. మరీ ఉత్తరాదిలో మూడో భాష ఏం నేర్పిస్తున్నారో ఎందుకు చెప్పరు? వారు అక్కడ రెండు భాషలు నేర్పించినట్లయితే మనం మూడో భాష ఎందుకు నేర్చుకోవాలి’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.