తమిళనాడులో తిరిగి అన్నాడీఎంకే పాలన వస్తుంది: ఈపీఎస్
తమ కూటమి 210 స్థానాలు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించిన పళని స్వామి
తమిళనాడులో అధికార డీఎంకే ప్రజాదరణ కోల్పోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి 210 సీట్లు గెలుచుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ అత్యున్నత నిర్ణయాధికారం సంస్థల కార్యనిర్వాహాక కమిటీ, జనరల్ కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీతో తమ పార్టీ పొత్తునే డీఎంకే విమర్శిస్తూనే ఉంటుందని, కానీ అన్నాడీఎంకే బంగారు పాలన గురించి వారు ఏమి చెప్పలేరని పళని స్వామి అన్నారు.
‘‘ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి 210 సీట్లు గెలుచుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి మీరందరూ మీ సహకారాన్ని అందించాలి’’ అని ఆయన అన్నారు.
తమిళనాడు లో ఎన్డీఏకు అన్నాడీఎంకే నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు 2026 ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.