కర్ణాటక శాసనసభలో ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేసే బిల్లు..

చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని కోరిన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ..

Update: 2025-12-11 12:19 GMT
Click the Play button to listen to article

కర్ణాటకలో ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వాటికి పాల్పడ్డ వారికి 10 ఏళ్ల జైలుశిక్ష, గరిష్టంగా రూ. లక్ష జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేయడమే బిల్లు ముఖ్యోధ్దేశన్నారు.

జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 13 మంది మృతి చెందిన తరువాత బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం రద్దు చేశారు. మ్యాచ్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థించింది. దీనిపై కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని శివకుమార్ చెప్పారు. స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని పేర్కొంటూ.. "ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగకూడదు. అనేక తప్పులు జరిగాయి. కర్ణాటక ఖ్యాతి దెబ్బతినకూడదనేది నా ఏకైక కోరిక" అని అన్నారు డీకే.

Tags:    

Similar News