‘‘సైబర్ మోసాలతో వేల నష్టం జరుగుతోంది’’
మూడేళ్లలో ఐదు వేల కోట్లు దోచుకున్నారన్న కర్ణాటక హోంమంత్రి
కర్ణాటకలో గత మూడు ఏళ్లలో ప్రజలు సైబర్ మోసాల కారణంగా రూ. 5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటి వరూ పోలీసులు రూ. 627 కోట్లు రికవరీ చేయగలిగారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు.
శాసనసభలో సకలేశ్ పూర్ బీజేపీ ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో కర్ణాటకలో దాదాపు 52,000 సైబర్ మోసాలు జరిగాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది’’ అని పరమేశ్వర అన్నారు.
పోలీసులు చట్టాలకు సవరణ తీసుకురావడం ద్వారా సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఆయన చెప్పారు. అయితే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ సవరణ పై కోర్టు స్టే తెచ్చుకుందని, ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. ఈ కేసు డిసెంబర్ 19కి జాబితా చేశారని ఆయన వెల్లడించారు.