మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని ట్రోల్ చేసిన టీవీకే అభిమానులు
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితుల క్షమాపణ
By : Praveen Chepyala
Update: 2025-10-06 11:31 GMT
కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై టీవీకే పార్టీని, కోలీవుడ్ నటుడు విజయ్ ను తీవ్రంగా ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని సామాజిక మాధ్యమాల్లో ఆయన పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురు టీవీకే పార్టీ కార్యకర్తలను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులపై అభియోగాలు...
నిందితులు పుదుకొట్టైకి చెందిన కన్నన్(24), కృష్ణగిరి జిల్లా బర్గూర్ కు చెందిన డేవిడ్ (25), ఈరోడ్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న చెన్నై నివాసి హస్తినాపురం శశి(48)గా గుర్తించారు.
విదేశాల్లో ఉన్న మిగిలిన అనుమానితులను వారి దేశాల రాయబార కార్యాలయాల ద్వారా ప్రశ్నించడానికి పిలిపిస్తామని, సోషల్ మీడియా ట్రోల్స్ నెట్ వర్క్ పై దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీస్ వర్గాలు ది ఫెడరల్ కు తెలిపాయి.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం నిందితులు న్యాయమూర్తికి రహస్య ఉద్దేశాలను ఆపాదించడం, ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడం, విషాదకరమైన కరూర్ తొక్కిసలాటపై ఆయన చేసిన కఠినమైన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి మాట్లాడటం వంటి పోస్టులు చేశారు.
దీనితో కేసు తీవ్ర వివాదంగా మారింది. టీవీకే నాయకులు చేసిన పోస్టులు న్యాయ అధికారి సమగ్రతను, విశ్వసనీయతను దెబ్బతీసింది.
ఈ పోస్టులపై సైబర్ క్రైమ్ నిర్వహించిన దర్యాప్తులో ముగ్గురు నిందితులు దొరికారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ పోస్టులలో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని తెలిపే డిజటల్ ముద్రలు కనిపించాయి. సోషల్ మీడియా వేధింపులపై న్యాయపరమైన చర్చ పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
నిందితుల క్షమాపణ..
అరెస్ట్ తరువాత రికార్డు చేసిన వీడియోలలో నిందితులు క్షమాపణ చెప్పారు. విజయ్ కు వీరాభిమాని అయిన కన్నన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇన్ స్టాగ్రామ్ లో కరూర్ విషాద సంఘటన చూశాను.
విజయ్ అభిమానిగా న్యాయమూర్తి చెప్పిన మాటలను తప్పుగా అభిప్రాయం వ్యక్తం చేశాను. దానికోసం పోలీసులు నన్ను అరెస్ట్ చేశాను. నేను నా తప్పును అంగీకరించాను. గౌరవనీయమైన న్యాయమూర్తికి క్షమాపణ చెబుతున్నాను’’
పోలీస్ అరెస్ట్ తరువాత మరో నిందితుడు డేవిడ్ తన సొంత వీడియోలో మాట్లాడుతూ.. ‘‘నేను బెంగళూర్ లో పనిచేస్తున్నాను. నా పని ముగిసిన తరువాత నేను సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాను.
న్యాయమూర్తి గురించి నేను తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేశాను. చెన్నైలోని సెయింట్ థామస్ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నేను చేసిన తప్పు ఎవరూ చేయవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నా చర్యలకు క్షమాపణ చెబుతున్నాను’’ అని చెప్పారు.
హైకోర్టు ఆగ్రహం..
ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ... సమాజంలో ఆన్ లైన్ ట్రోలింగ్ సమస్యను లేవనెత్తారు. ‘‘ న్యాయమూర్తులపై ట్రోల్స్ జరుగుతున్నాయి. గతాన్ని గుర్తుకు తెస్తారు. కుటుంబ సభ్యులను తీసుకువస్తారు’’.
ఆయన స్టాయిసిజాన్ని సమర్థిస్తూ ‘‘మనం వీటిని చూసి నవ్వుకోవాలి. మీరు సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడూ ఇవి జరుగుతాయి’’ అన్నారు. కరూర్ తొక్కిసలాట గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని, దాని ఫలితంగా భయాందోళనలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనీ ఆరోపిస్తూ తమిళనాడు పోలీసులు 25 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులపై కేసులు నమోదు చేశారు.