ఎంకే స్టాలిన్‌కు యాంజియోగ్రామ్..

ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం;

Update: 2025-07-24 07:34 GMT

తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చేరారు. సోమవారం (జూలై 21) ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు తలతిరిగినట్లు అనిపించడంతో సిబ్బంది ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు కొన్ని రకాల పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచే పాలన కొనసాగించనున్నారు.

సీఎంను పరామర్శించిన తర్వాత సీనియర్ డీఎంకే మంత్రి దురై మురుగన్ మీడియాతో మాట్లాడారు.‘‘స్టాలిన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆందోళన అవసరం లేదు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆసుపత్రి నుంచే అధికారిక వ్యవహారాలు చూస్తారు. ప్రధాన కార్యదర్శితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రారంభించిన 'ఉంగలుదన్ స్టాలిన్' కార్యక్రమంపై సీఎం సమీక్షించారు.’’ అని చెప్పారు. ఇదిలా ఉండగా.. బుధవారం తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్టాలిన్ అధికారిక విధులను అక్కడి నుంచే నిర్వహిస్తారని అందులో రాసి ఉంది. 

Tags:    

Similar News