సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎంలు.. ఎవరంటే..
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రెండు రాష్ట్రాల సీఎంలు స్వాగతించారు. తాము ఈ తీర్పును అమలు చేస్తామని తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి..
By : Praveen Chepyala
Update: 2024-08-01 11:54 GMT
ఎస్సీ, ఎస్టీ ల్లోని ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ సమూహాలలో మరింత వెనుకబడిన కులాలకు కోటాను మంజూరు చేయడానికి రాష్ట్రాల వారీగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను మరింత ఉప-వర్గీకరణ చేయడానికి అనుమతించింది.
తమిళనాడు సీఎం స్పందన
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, అణచివేతకు గురైన ప్రజల సామాజిక విముక్తిని కల్పించేందుకు, అలాగే ద్రావిడ నమూనా యాత్రకు ఈ తీర్పు మరో గుర్తింపు అన్నారు. అరుంథతియార్ వర్గానికి 3 శాతం అంతర్గత కేటాయింపులు చేసేందుకు అసెంబ్లీలో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారని గుర్తు చేశారు. "సుప్రీంకోర్టు చట్టాన్ని సమర్థించడం హర్షణీయం" అని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కూడా ఈ తీర్పును స్వాగతించారు. ఉప వర్గీకరణల కోసం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించిందని అసెంబ్లీలో చెప్పారు.
“నేను రాజ్యాంగ ధర్మాసనానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను… రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఉప వర్గీకరణను అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని నేను ఒక ప్రకటన చేస్తున్నాను,” అని సీఎం అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాల నోటిఫికేషన్‌లలో కూడా సబ్‌క్లాసిఫికేషన్‌ను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తుందని చెప్పారు.
BRS కూడా మద్దతు ఇస్తుంది
కోర్టు తీర్పును తమ పార్టీ కూడా స్వాగతిస్తున్నదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత కెటి రామారావు అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండగా, ఉప వర్గీకరణ కోసం బీఆర్‌ఎస్ ఎప్పుడూ చిత్తశుద్ధితో పని చేసిందని అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప వర్గీకరణను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి BRS మద్దతు ఇస్తుంది" అని రామారావు చెప్పారు.
2004 రూలింగ్ తోసిపుచ్చింది
ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు, ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత వివక్ష కారణంగా వారు తరచుగా అనేక అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొంది.
2004 తీర్పు ప్రకారం SCలు, STలు సజాతీయ సమూహాలు కాబట్టి రాష్ట్రాలు ఈ సమూహాలలో మరింత వెనుకబడిన, బలహీనమైన కులాల కోటా లోపల కోటాను మంజూరు చేయడానికి వారిని ఉప-వర్గీకరించలేవని తీర్పునిచ్చారు