‘ఆదర్శాలు లేని పార్టీలను గుర్తించరు’
టీవీకే చీఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పించిన వీసీకే నాయకుడు తోల్ తిరుమావళవన్..
తమిళనాడు(Tamil Nadu)లోని విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ వ్యవస్థాపకుడు తోల్ తిరుమావళవన్ (Thirumavalavan) శనివారం (అక్టోబర్ 11) తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్(Vijay)నుద్దేశించి విమర్శించారు. కొంతమంది వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని రాజకీయ పార్టీలు పెడుతున్నారని, పార్టీకి బలమైన ఆదర్శాలు లేకుండా అది సాధ్యం కాదన్నారు. నటనా రంగం నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌ను ప్రజలు ఆదరిస్తారని తాను అనుకోవడం లేదున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించే ముందు తిరుమావళవన్ తిరుచ్చి విమానాశ్రయంలో కాసేపు విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 27న విజయ్ కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
"మీ ఆశయం తప్పు అని నేను అనడం లేదు. కానీ నిజమైన రాజకీయ పార్టీకి బలమైన ఆదర్శాలుండాలి. శాసనసభలో లేదా పార్లమెంటులో ప్రతినిధులు లేకపోయినా అవే పార్టీకి మద్దతుగా నిలుస్తాయి,’’ అని అన్నారు.