ఆర్య అనే పదాన్ని ఎక్కడా జాతి కోణం లో వాడలేదు: ఆర్ఎన్ రవి

ద్రవిడ భావజాలమే విభేదాలను సృష్టించిందని విమర్శలు;

Update: 2025-03-04 10:30 GMT

దేశంలో ఆర్యులు, ద్రవిడులు వేరు అనే పదాన్ని ద్రవిడ భావజాలం సృష్టించిందని, భారతీయ సాహిత్యంలో ఆర్యన్ అనే పదాన్ని ఎక్కడా కూడా ‘జాతి’ అనే కోణం వాడలేదని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అభిప్రాయపడ్డారు. గత 60- 70 సంవత్సరాలలో ఈ భావన అనేక వ్యత్యాసాలను సృష్టించిందని అన్నారు.

భారతీయ సాహిత్యంలో ఎక్కడా కూడా లేదా సంగం లేదా వేద సాహిత్యంలో కూడా ‘ఆర్యన్’ అనే పదాన్ని జాతిగా ఉపయోగించలేనే లేదని దాన్ని మధ్యంతరంగా తీసుకొచ్చారన్నారు.
‘‘వాస్తవానికి తమిళ సాహిత్యం కూడా ఆర్యన్ అనే పదాన్ని కూడా జాతిగా ఉపయోగించలేదు. గత 60-70 సంవత్సరాలలో ద్రావిడ భావజాలం ఆర్యులు, ద్రావిడుల మధ్య వ్యత్యాసాలను కథనాన్ని సృష్టించింది’’ అని గవర్నర్ ఇక్కడ డీజీ వైష్ణవ్ కళాశాలలో సింధు నాగరికత: దాని సంస్కృతి, ప్రజలు- పురావస్తు సంగ్రహలోవనం అనే రెండు రోజుల సదస్సు ప్రారంభోత్సవంలో అన్నారు.
ఈ నాగరిత వేదాల ద్వారా ప్రసాదించిన జ్ఙానం. వేల సంవత్సరాలుగా భారత్, దాని సంస్కృతి ఆలోచన, గుర్తింపును ఎలా రూపొందించిందో, దాని సృష్టి ఏకత్వం, సార్వత్రిక సోదరభావం అనే విలువలు మన వ్యక్తిగత, జాతీయ, ప్రపంచ దృక్పథాలలో మనం ఎలా నిర్వచించి, ప్రేరిపిస్తున్నాయో అని గవర్నర్ వివరించారు.
యూరోపియన్ వలసవాదులు, అలాగే ఆర్య దండయాత్ర, ఆర్య జాతి సిద్దాంతాలను తప్పుగా ప్రచారం చేసిన మార్కిస్ట్, ద్రవిడ వాదులు వారి స్వార్థ ప్రయోజనాలు, వక్రీకరణలు తప్పుడు వివరణ ద్వారా దీర్ఘకాలంగా ఈ జాతిపై జరుగుతున్న మేధో, రాజకీయ హింస నుంచి రక్షించుకోవాలని కోరారు.
‘‘ఉప గ్రహ చిత్రాలు, అణు భౌతిక శాస్త్రం సహ ఆధునిక శాస్త్రం సరస్వతి- సింధు నాగరికత’’ ఇవన్నీ కూడా భారతదేశాన్ని వేద నాగరికతే అనే చారిత్రక సత్యాన్ని రుజువు చేసిందని అని ఆయన అన్నారు.
మన సమగ్ర జాతీయ పునర్జీవన సమయంలో సరస్వతి- సింధు నాగరికత చారిత్రాత్మకంగా సరైన కథనాన్ని వ్యాప్తి చేయడంలో ప్రజలు చురుగ్గా ఆలోచించాలని గవర్నర్ కోరారు.
Tags:    

Similar News