‘కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు’

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలపై కేరళ ప్రభుత్వం ఎలా స్పందించింది? ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వివరణ ఏంటి?

Update: 2024-06-01 08:44 GMT

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేరళలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకున్న కేరళ సర్కారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో దర్యాప్తు కూడా చేయించింది. తమ రాష్ట్రంలో అలా జరిగే అవకాశం లేదని స్వయంగా దేవదాయ శాఖ మంత్రే చెప్పారు.

ఇంతకు డీకే ఏమన్నారు?

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తనతో పాటు, సీఎం సిద్ధరామయ్యపై తమ రాష్ట్రానికి చెందిన కొందరు రాజకీయ పార్టీ నాయకులు చేతబడి చేయించారని ఆరోపించారు. కేరళలోని కన్నూర్ జిల్లా తాలిపరంబ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో ఈ పని చేయించేందుకు అఘోరాలను సంప్రదించారని పేర్కొన్నారు. జంతుబలి కూడా చేయించారని చెప్పారు.

స్పందించిన కేరళ సర్కారు..

డీకే శివకుమార్ పేర్కొన్నట్లు ఎటువంటి జంతుబలి జరగలేదని కేరళ ప్రభుత్వం శనివారంపేర్కొంది. గుడి దగ్గర జంతుబలి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక కూడా ఇచ్చారు.

‘జరిగే అవకాశమే లేదు’

"డీకే శివకుమార్ వ్యాఖ్యలపై విచారణ జరిపాం. ఆయన చెప్పినట్లుగా ఆలయంలోపల, ఆలయ పరిసరాల్లో ఏం జరగలేదు. జంతు బలి చట్ట ప్రకారం నిషేధం. కేరళలో అలా జరిగే అవకాశమే లేదు. మరి శివకుమార్ ఎందుకు ఇలా మాట్లాడారో పరిశీలించాల్సి ఉంది.’’ అని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ చెప్పారు.

ఇటు శివకుమార్ ఆరోపణలను ఆలయ మేనేజింగ్ కమిటీ కూడా శుక్రవారం ఖండించింది. అతని చెబుతున్నది అవాస్తవమని పేర్కొంది.

Tags:    

Similar News