మద్దూర్ హింస: రాళ్ల దాడికి హిందువులే కారణం: కాంగ్రెస్

వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లదాడికి పాల్పడిన ఓ వర్గం ఉన్మాదులు, ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ;

Update: 2025-09-08 12:21 GMT
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర

మద్దూర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా చెలరేగిన హింసపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాళ్లదాడి ఘటనలో పాల్గొన్న వారిలో హిందూ అనుకూల సంస్థల సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

పోలీసులు చేసింది..
బెంగళూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.
ఈ దశలో రాళ్లదాడిలో ఎవరెవరూ పాల్గొన్నారో పూర్తిగా స్పష్టంగా తెలియలేదు. అయితే పోలీసుల ప్రకారం.. అరెస్ట్ అయిన వారిలో కొందరు హిందూ అనుకూల సంస్థలకు చెందినవారు’’ అని ఆయన ఆరోపించారు.
పోలీసులు శాంతిని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకున్నారని పరమేశ్వర చెప్పారు. ‘‘పోలీసులు సంస్థలను సహకరించమని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితి అదుపు తప్పినప్పుడూ వారు లాఠీచార్జీ చేశారు.
కస్టడీలో ఉన్నవారిపై దర్యాప్తు జరుగుతోంది. వారి ప్రమేయం రుజువైతే కఠినమైన చర్యలు తీసుకుంటారు. దర్యాప్తు పూర్తయిన తరువాత మాత్రమే పూర్తి నిజం బయటపడుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ విమర్శలు..
మద్దూర్ పట్టణంలో జరిగిన మత హింసపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక సోమవారం డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు దుండగులకు లైసెన్స్ ఇచ్చినట్లు ఉందని, హిందువులను రెండో తరగతి పౌరులుగా చూసే విచిత్ర పరిస్థితిని సృష్టించాయని ఆయన ఆరోపించారు.
చాముండేశ్వరి దేవతను, ధర్మస్థలాన్ని అవమానించినందుకు, ఇప్పుడు మద్దూర్ సంఘటనకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న మద్దూర్ లో జరిగిన గణేశ ఊరేగింపుపై జరిగిన రాళ్లదాడి ఒక్క సంఘటన కాదని, ఒక పెద్ద ప్రణాళిక అని ఆశోక బెంగళూర్ లో విలేకరులతో అన్నారు. కాంగ్రెస్ తన విధానాలు, ప్రకటనల ద్వారా ఇటువంటి చర్యలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.
ఉద్దేశపూర్వక వైఫల్యామా?
ఘర్షణనలను నివారించడంలో పరిపాలన విభాగం ఉద్దేశ్యపూర్వకంగా విఫలమైందని అశోక ఆరోపించారు. ప్రభుత్వం రిజర్వ్ చేసిన పోలీస్ వ్యాన్ ను మోహరించి ఉంటే వేల మంది పోలీసులను మోహరించడం లాఠీ ఛార్జ్ చేయడం ఆసుపత్రిలో చేర్పించడం నిరసనలు అవసరం ఉండేదని కాదని ఆయన అన్నారు. నిరసనకారులపై లాఠీచార్జీ చేసినప్పటికీ రాళ్లు విసిరిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని అశోక ప్రశ్నించారు.
హిందువులు ఐక్యంగా లేకుంటే ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారిపోతుందని హెచ్చరించారు. అశోక ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేశాడు. ‘‘ మనం హిందువులు ఈ రోజు ఐక్యంగా లేకుంటే ఇది మన గతి అవుతుంది. సిద్ధరామయ్య ఓట్ల కోసం తన పదవిని కాపాడుకోవడానికి అధికారంలో ఉండటానికి ఏదైనా చేయగలడని నేను ప్రజలకు చెబుతున్నాను. అధికారం కోసం కాంగ్రెస్ కులాల మధ్య చీలికను సృష్టించగలరు’’ అని ఆయన అన్నారు.



Tags:    

Similar News