ఉప ఎన్నికల బరిలో కేరళ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ అభ్యర్థులు?

పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ వడకర లోక్‌సభ స్థానం నుంచి, అలాగే చెలక్కర నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అల్లత్తూర్ స్థానం నుంచి గెలిచారు.

Update: 2024-10-11 12:18 GMT

కేరళలో చెలక్కర, పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. పాలక్కాడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ వడకర లోక్‌సభ నియోజకవర్గం నుంచి, అలాగే చెలక్కర నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కే రాధాకృష్ణన్ అల్లత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయా? లేదా? అన్న విషయం అటుంచితే.. అధికార సీపీఐ(ఎం)తో విభేదించిన నిలంబూరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ మాత్రం డెమోక్రటిక్ మూవ్‌మెంట్ ఆఫ్ కేరళ (డీఎమ్‌కె) తరుపున అభ్యర్థులను బరిలో నిలుపుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం ఉప ఎన్నికలలో అభ్యర్థులను నిలబెడతారా? అని అడిగిన ప్రశ్నకు అన్వర్ సూటిగా సమాధానం చెప్పలేదు. పరిస్థితులకు బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతూనే త్వరలో పాలక్కాడ్‌లో డీఎంకే జిల్లా సదస్సు ఉంటుందని పేర్కొ్న్నారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఐపీఎస్‌ అధికారి, ఏడీజీపీ ఎంఆర్‌ అజిత్‌కుమార్‌పై నిలంబూరు ఎమ్మెల్యే అన్వర్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మార్క్సిస్ట్ పార్టీ పతనానికి విజయన్ కారణమని, ADGP రాష్ట్రంలో RSS 'ప్రకటించని ఫ్రంట్ సైనికుడు' అని కూడా ఆరోపించారు. దీంతో సీఎం విజయన్, కొందరు మంత్రులు ఆయనను దూరం పెట్టారు. ఆ తరువాత అన్వర్ ఒక సామాజిక సమూహాన్ని ప్రారంభించి దానికి కేరళ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (డీఎమ్‌కె) అని పేరు పెట్టాడు. దీన్ని ప్రారంభించటానికి ముందు అన్వర్ చెన్నై వెళ్లి తమిళనాడులోని పాలక ద్రవిడ మున్నేట్ర కజగం నాయకులను కలిశారు. అయితే ఆ భేటీ ఉద్దేశ్యంపై ఇరువర్గాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పొరుగు రాష్ట్ర అధికార పార్టీ అన్వర్‌కు దూరంగా ఉంచినట్లు సమాచారం.

Tags:    

Similar News