‘నందిని’ నెయ్యినే వినియోగించాలి

తిరుమల వెంకన్న లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-21 10:41 GMT

తిరుమల వెంకన్న లడ్డూలో కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రభుత్వ డెయిరీ నందినీ నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశించింది. హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ శాఖ పరిధిలోని 34 వేల దేవాలయాలలో నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడాలని సర్క్యులర్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోని అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, ప్రసాదం తయారీ కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఉత్పత్తి చేసే నంది నెయ్యిని మాత్రమే ఉపయోగించాని, భక్తులకు అన్నదానం, ప్రసాదం నాణ్యతలో రాజీ పడొద్దని ఆ ఉత్తర్వు్ల్లో పేర్కొన్నారు.

డెయిరీ పరిశ్రమలో 'నందిని మిల్క్​'కు ప్రత్యేక స్థానం ఉంది. 1974లో ఏర్పాటయిన కర్ణాటక డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెడిడిసి) ఆ తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) గా రూపాంతరం చెందింది. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్​, చీజ్​, బటర్​, ఫ్లేవర్డ్​ మిల్క్​ వంటి డెయిరీ ఉత్పత్తులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను కూడా నందిని మిల్క్​ బ్రాండ్​ కింద కేఎంఎఫ్​ తయారు చేస్తుంది. వీటికి మంచి డిమాండ్​ ఉంటుంది. అయితే పాలతో పాటు నందిని ఆవు నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొంత కాలం క్రితం వరకు తిరుమల లడ్డూలో ఉపయోగించిన ఈ నందిని నెయ్యికి AGMARK సర్టిఫికేట్​ కూడా ఉంది.

Tags:    

Similar News