ఆ కేసులో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు బెయిల్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై నమోదైన ఏ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు వారిపై దావా వేసిన వ్యక్తి ఎవరు?

Update: 2024-06-01 07:22 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్‌కు పరువు నష్టం దావా కేసులో శనివారం బెయిల్ మంజూరైంది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలం పార్టీ నాయకులు కోర్టులో దావా వేశారు. సిద్ధరామయ్య, శివకుమార్‌, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్‌ ప్రసాద్‌ ఈ పరువు నష్టం దావా వేశారు. దాంతో

సిద్ధరామయ్య, శివకుమార్ ఈ రోజు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారి పిటిషన్‌ను విచారించిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

అన్ని ప్రజా ప్రయోజనార్థం చేపట్టే పనులకు 40 శాతం కమీషన్ వసూలు చేశారని ఆరోపిస్తూ..బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ 'అవినీతి రేటు కార్డు'ను కూడా ప్రచురించింది. 

Tags:    

Similar News