IARC నివేదికతో వక్క తోటల రైతుల్లో ఉలికిపాటు..కారణమేంటి?

వక్క నమలడం వల్ల క్యాన్సర్ వస్తుందా? అలా చెప్పిందెవరు? ఆ ఒక్క నివేదికతో కర్ణాటక రైతులకు భయం పట్టుకుందా? మరి వారు ఏం చేయబోతున్నారు?

Update: 2024-11-21 10:19 GMT

వక్క పలుకులు తినడం వల్ల నోటి క్యాన్సర్‌ వస్తుందని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ సంస్థ హెచ్చరించడంతో వక్క తోట సాగు రైతుల్లో ఆందోళన మొదలైంది. పొగాకును ప్రమోట్ చేయడానికే ఇలాంటి నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IARC రిపోర్టేమిటి?

ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్‌తో బాధపడే ప్రతి ముగ్గురిలో ఒకరు పొగ రహిత పొగాకు, వక్క నమిలిన వారేనని WHO అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అక్టోబరు 9న వెల్లడించింది. ఈ ఒక్క నివేదిక కర్ణాటకలో వక్క తోటల రైతులను ఉలిక్కిపడేలా చేసింది. కేరళ, అస్సాం, మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోని వేల మంది వక్కతోటల రైతుల్లో గుబులు పుట్టిస్తోంది.

వక్క సాగు రైతులేమంటున్నారు?

వక్క పలుకులను నమలడం వల్ల నోటి క్యాన్సర్ రాదని వక్క తోటల రైతులు బలంగా చెబుతున్నారు. తమలపాకుతో కలిసి వక్కను నమలడం వల్ల ఆరోగ్యానికి ఏ హాని ఉండదంటున్నారు. పొగాకును ప్రమోట్ చేసుకోడానికి వక్క రైతులను టార్గెట్ చేశారని మల్నాడు రైతు పోరాట సమితి (మల్నాడు రైతుల ఉద్యమం) అధ్యక్షుడు టిఎన్ శ్రీనివాస ఫెడరల్‌తో చెప్పారు. సెంట్రల్ అరెకా నట్ అండ్ కోకో మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ కొడగి కూడా WHO నివేదిక నమ్మశక్యం లేదని పేర్కొన్నారు.

NICPR అదే చెప్పిందా?

WHO అనుబంధ సంస్థ మాత్రమే కాకుండా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ (NICPR) ఇలాంటి హెచ్చరికలే గతంలో జారీ చేసింది. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి అనుప్రియా పటేల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదికను ఉటంకిస్తూ.. మౌత్ క్యాన్సర్ కేసులు చాలావరకు పొగతాగడంతో వచ్చినవన్న ఆధారాలు ఉన్నాయని, మద్యం, బీటిల్ క్విడ్, వక్కలు కొంతమేర ప్రభావ కారకాలు అని పేర్కొన్నారు. అయితే ICMR నివేదికను కిషోర్ కుమార్ కొడగి కొట్టిపడేశారు. పొగాకు, వక్కను కలిసి తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారన్నది ఆయన వాదన.

రైతులు ఏం చేయబోతున్నారు?

తాజా సంక్షోభం ఇంతకుముందు దాని మాదిరిగానే కనుమరుగై పోతుందని తోట ఉత్పన్నగల మారట సహకార సంఘ (TUMCOS) అధ్యక్షుడు RM రవి విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ రకమైన నివేదికలు ఇంతకుముందు కూడా ఆందోళనకు గురిచేశాయి. రైతులు భయపడాల్సి పనిలేదు. సమస్యను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం.’’ అని అన్నారు. సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపకపోతే డిసెంబర్ 15 తర్వాత కర్ణాటకలో నిరసనలు చేపట్టాలని మల్నాడు రైతు ఉద్యమం నిర్ణయం తీసుకుంది.

లాభాల నుంచి సంక్షోభంలోకి..

వక్క, తమలపాకును కలిపి తీసుకోవడం ఆసియా దేశాలలో వేలాది సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం అని శ్రీనివాస పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోని మల్నాడు ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వక్కసాగు ఉత్తరాదిలోని శుష్క ప్రాంతాలకూ విస్తరించింది. ఇతర పంటలతో పోలిస్తే వక్క తోటల సాగు మంచి రాబడినిస్తుంది. 2019-20లో 4,52,650 హెక్టార్ల నుంచి 2023 చివరి నాటికి కర్నాటకలో వక్క తోటల సాగు దాదాపు రెట్టింపయ్యింది. ఇప్పుడు ఇది 7,36,650 హెక్టార్లలోకు పెరిగింది.

నష్టపోయిన రైతులు..

2019-20లో కర్ణాటక అత్యధికంగా 457.56 వేల టన్నుల వక్క గింజలను ఉత్పత్తి చేసింది. 2024లో ఈ ఉత్పత్తి రెట్టింపు అయింది. వక్క గింజల ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటక వాటా 78.98 శాతం. ప్రపంచంలోని వక్కల ఉత్పత్తి 54.07 శాతం భారత్‌లోనే ఉంది. కాగా ఆగస్ట్ 2024లో వక్కల నాణ్యత సరిగా లేదని ఉత్తర భారతదేశంలోని వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు నష్టపోయారు. నెలలో క్వింటాల్ ధర రూ.55 వేల నుంచి రూ.45 వేలకు పడిపోయింది. నాణ్యమైన దిగుబడి కోసం ప్రయత్నించినా తిరస్కరించారని మల్నాడ్ అరేకా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేర్కొంది. ఈ పరిణామాలన్నీ ఈ ఏడాది తెల్ల వక్క తోటల రైతుల స్ఫూర్తిని దెబ్బతీశాయి.

వక్క తోట రైతులను ఆదుకోవాలి.

ఇండియాలో వక్క తోటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా.. కేంద్రం మాత్రం నేపాల్, శ్రీలంక దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని దక్షిణ కన్నడ జిల్లా రైతు సంఘాల ఒక్కటాకు చెందిన సన్నీ డిసౌజా ఆరోపించారు. “భారతదేశం ఇప్పటికే మంచి నాణ్యత గల వక్కలను ఉత్పత్తి చేస్తోంది. వక్క తోటల రైతులను ఆదుకోడానికి దిగుమతులను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం'' అని పేర్కొన్నారు.

Tags:    

Similar News