ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడని హస్టల్ కుక్ తొలగింపు
ఇంతకుముందు పంచాయతీ అధికారిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ సర్కార్
By : Praveen Chepyala
Update: 2025-10-22 12:14 GMT
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్నాడనే నెపంతో కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ ఓ హస్టల్ వంట మనిషిని విధుల నుంచి తొలగించింది. బీదర్ జిల్లా బసవ కళ్యాణలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ కుక్ గా ప్రమోద్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆయన అక్టోబర్ 20 న ఆర్ఎస్ఎస్ నిర్వహించిన మార్చ్ లో పాల్గొన్నట్లు వాట్సాప్ ద్వారా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారికి ఫిర్యాదు అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది.
బసవకళ్యాణ తాలూకా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, కుమార్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు బీదర్ జిల్లా కార్మిక సేవల బహుళార్థక సాధన సహకార సంఘం కార్యదర్శి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్యాలయానికి లేఖ రాశారు.
‘‘ప్రమోద్ కుమార్ ఔట్ సోర్సింగ్ ద్వారా బసవ కళ్యాణలోని ప్రీ మెట్రిక్ బాలుర హస్టల్ లో అసిస్టెంట్ కుక్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న శాశ్వత, ఔట్ సోర్సింగ్ సిబ్బంది చట్టం ప్రకారం ఏ సంస్థలోనే పాల్గొనకూడదు.’’ అని లేఖలో పేర్కొన్నారు.
ప్రమోద్ కుమార్ ను అక్టోబర్ 21 ఉదయం నుంచి విధుల నుంచి విడుదల అయ్యారు. బీదర్ జిల్లా లేబర్ సర్వీసెస్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సోసైటీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.
గతవారం రాయచూర్ లోని లింగ్సుగూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలకు హజరైనందుకు పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
అనంతరం ఆర్ఎస్ఎస్ ఉత్సవాలపై పాల్గొన్న ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ అనుబంధం ఉన్న సంస్థలలో సభ్యత్వం తీసుకోరాదని కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కర్ణాటక సివిల్ సర్వీసెస్ నిబంధనలను మంత్రి ఉదహరించారు.