చెన్నైలో రాజకీయ పార్టీలతో EC సమావేశం..
త్వరలో తమిళనాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ..
తమిళనాడు(Tamil Nadu)లో త్వరలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(S.I.R) ప్రారంభం కానుండడంతో ఎన్నికల సంఘం (EC) అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయబోతుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అక్టోబర్ 28 సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు. సుమారు 75 వేల మంది సిబ్బంది ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొననున్నారు. వీరంతా ఇంటింటికి వెళ్లి ఓటర్లు వివరాలు సేకరించి నమోదు చేస్తారు. EC-రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన మొబైళ్లతో BLOలు ఓటరు వివరాలను నమోదు చేస్తారు. అయితే పర్యవేక్షణ కోసం రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు కల్పించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(SIR) ను చేపట్టబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని EC అధికారులు శనివారం (అక్టోబర్ 25) తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆలస్యంగా నిర్వహిస్తారు.
ఇక బీహార్‌లో S.I.R ముగిసింది. సెప్టెంబర్ 30న దాదాపు 7.42 కోట్ల పేర్లతో తుది జాబితాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.