ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం సిద్దరామయ్య
హజరుకానీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరోసారి చెలరేగిన ఊహగానాలు;
By : Praveen Chepyala
Update: 2025-07-29 11:59 GMT
కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య నిర్వహించిన ఎమ్మెల్యే సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హజరుకాకపోవడంతో రాష్ట్రంలో మరోసారి ఊహగానాలు చెలరేగాయి.
శాసన సభ్యులలో విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశాలు ప్రారంభించారు.
ఈ సమావేశాలు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, మంత్రుల పట్ల అసంతృప్తి లేదా పరిపాలనపరమైన అడ్డంకులు వంటి సమస్యలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రితో విన్నవించుకోవడానికి వీటిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శ్రేణుల్లోని మనోవేదనలను పరిష్కరించడానికి సిద్దరామయ్య తీసుకున్న ప్రధాన చొరవగా దీనిని భావిస్తున్నారు.
శివకుమార్ తొలగింపు ఊహగానాలు
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం శివకుమార్ ఈ ముఖ్యమైన సమావేశాలకు హజరుకాలేదు. ఇప్పటి వరకూ ఏ సమావేశానికి హజరు కాలేదని సమాచారం. ఈ మినహయింపు రాజకీయా వర్గాలలో విస్తృతమైన ఊహగానాలకు దారితీసింది.
సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నాయకత్వ పోరు గురించి కొనసాగుతున్న ఊహగానాల మధ్య సమావేశాలకు శివకుమార్ గైర్హాజర్ కావడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. ఇది రాజకీయ పోరుకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.
ఇటీవల సీఎం సిద్ధరామయ్య ప్రతి ఎమ్మెల్యేకు రూ. 50 కోట్లు గ్రాంట్ ను ప్రకటించారు. ఇప్పుడు విస్తృత జిల్లాల పర్యటనల మధ్యలో శాసనసభ్యుల సమస్యలను స్వయంగా వినాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం మొదటి రోజు ఆయన మైసూర్, చామరాజనగర్, తుమకూర్, కొడగు, హసన్, దక్షిణ కన్నడ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పెరుగుతున్న అసంతృప్తిని అరికట్టడానికి ఈ సమావేశాలు తీవ్రమైన, వ్యూహాత్మకమైన ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.