కర్ణాటకలో కొత్తగా 'కుల గణన'.. తేదీని ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
గతంలో చేసిన సర్వేపై రెండు సామాజికవర్గాల వ్యతిరేకత..;
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddraramaiah) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కులగణన(Caste Census) ఈనెల 22వ తేదీ నుంచి మొదలవుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘7 కోట్ల మంది ప్రజల సామాజిక స్థితిని తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారవుతుంది. కుటుంబ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అందులో 60 ప్రశ్నలు ఉంటాయి. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్ మధుసూధన్ ఆర్ నాయక్ నేతృత్వంలో కొత్త సర్వే జరుగుతుంది. సర్వే పూర్తి చేసి, డిసెంబర్ కల్లా కమిషన్ నివేదికను సమర్పిస్తుంది. దసరా సెలవుల్లో లక్ష 75వేల మంది ఉపాధ్యాయులు సర్వేలో వివరాలు సేకరిస్తారు. విధులు నిర్వహించే ప్రతి ఉపాధ్యాయులకు రూ.20వేలు వేతనం అందుతుంది. సర్వే కోసం రూ. 420 కోట్లు కేటాయించాం. అవసరమయితే మరిన్ని నిధులు సమకూరుస్తాం. అంతకుముందు 2015 లో చేపట్టిన సర్వేకు కర్ణాటక ప్రభుత్వం రూ.165.51 కోట్లు ఖర్చు చేసింది.’’ అని వివరించారు.
కర్ణాటకలో రెండు ఆధిపత్య సామాజిక వర్గాలు 2015 సర్వేపై తీవ్ర అభ్యంతరాలు తెలపడంతో కొత్తగా సర్వే చేయిస్తున్నాయి.