కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం, డిప్యూటీ సీఎంల భిన్నాభిప్రాయాలు.

కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఐదు హామీల పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి.

Update: 2024-10-31 11:43 GMT

‘‘శక్తి’’ పథకాన్ని పునఃసమీక్షించడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేశారు. మహిళలు కూడా ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. అయితే ఆర్టీసీకి మాత్రం నష్టం వేల కోట్లలో ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక కార్యక్రమంలో ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారు. ‘‘ కొంత మంది మహిళలు బస్సుల్లో చార్జీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, ఉచిత ప్రయాణ పథకం అక్కర్లేదని తనకు ట్వీట్లు పెడుతూ మెయిల్ పంపుతున్నారని పేర్కొన్నారు. ఆ విషయంపై మరోసారి అందరం కూర్చుని చర్చిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మహిళల్లో ఆందోళన మొదలైంది. ఈ స్కీమ్ ఎత్తివేస్తారన్న అనుమానాలు రేకెత్తాయి. శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే సీఎం సిద్ధరామయ్య మరో ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని చెప్పారు. కొందరు మహిళలు చెబుతున్న మాటలను మాత్రమే శివకుమార్ చెప్పారు. ఈ విషయంలో నేను కూడా ఆయనతో మాట్లాడతానని బెంగళూరులో విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఐదు హామీల పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపు జూన్ 11, 2023న ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ ఏడాది అక్టోబరు 18 నాటికి శక్తి పథకానికి రాష్ట్రం రూ.7,507.35 కోట్లు ఖర్చు చేసింది.

Tags:    

Similar News