యూపీఐతో కేంద్రమంత్రిని ఫిదా చేసిన ఆటో డ్రైవర్.. ఏం చేశాడో తెలుసా ?

రోజువారీ మన జీవన విధానంలో యూపీఐ అనేది నేడు కీలకంగా మారింది. అనేక చోట్ల మనం క్యూఆర్ కోడ్ చూస్తూ ఉంటాం. అయితే బెంగళూర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఓ అడుగు ముందుకు వేసి

By :  491
Update: 2024-09-23 11:41 GMT

దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చాక మనీ ట్రాన్స్ ఫర్ చాలా సులువుగా మారింది. కూరగాయలు, ఛాయ్ వాలా, ఆటోవాలా ఇలా అన్ని ప్రదేశాల్లో యూపీఐ తో చెల్లింపులు జరుగుతున్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ ఆటో డ్రైవర్ మరో అడుగు ముందుకేసి యూపీఐ చెల్లింపులు మరింత సులువు చేశాడు.

అతని వినూత్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధానానికి కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన "UPI का swag🤘 చెల్లింపులు చాలా సులభం." అని రాసుకొచ్చారు. 

ఆటో డ్రైవర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీకి సంబంధించిన QR కోడ్ కస్టమర్ తన స్మార్ట్ వాచ్ స్క్రీన్‌పై స్కాన్ చేయడానికి, ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఈ స్మార్ట్‌వాచ్‌ని చూపుతున్న ఆటోడ్రైవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు దీనిని సాంకేతిక పరిజ్ఞానపు ఆధునిక పద్ధతిగా పేర్కొన్నారు.
ఈ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్ యూజర్ విశ్వజీత్ నుంచి వచ్చినదని జాతీయ మీడియా నివేదించింది. అతను పేరు తెలియని ఆటో డ్రైవర్‌ను ఇలా ప్రశంసించాడు. “ఆటో అన్న (తమ్ముడు) బెంగుళూరును మరింత ముందుకు తీసుకుపోయాడు ” అని రాసుకొచ్చాడు. "ఇది కొత్త భారతదేశపు చిత్రం" అని ఒక ఎక్స్ వినియోగదారు వ్యాఖ్యానించారు. "ఇది డిజిటల్ ఇండియా మాయాజాలం " అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
UPI లావాదేవీలు అంటే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభించబడిన UPI, బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలను అనుమతించడం ద్వారా చెల్లింపులలో విప్లవాత్మక మార్పులు చేసింది. సాంకేతికత, దాని సౌలభ్యం కోసం విస్తృతంగా స్వీకరించబడింది.రోజువారీ జరిగే అనేక కార్యక్రమాలకు ఇప్పుడూ యూపీఐ అంగీకరించబడింది.
ఈ డిజిటల్ చెల్లింపుల వృద్ధి పెరుగుతూనే ఉంది. UPI ఇప్పుడు ప్రతి నెలా 60 లక్షల మంది కొత్త వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై కాలంలో UPI దాదాపు రూ. 81 లక్షల కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. గడచిన ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం పెరుగుదలకు సమానం.


Tags:    

Similar News