‘మీరే నిధులు కేటాయించట్లేదు, కాదు మీరే భూసేకరణ చేయట్లేదు’
రైల్వే లైన్లపై కేంద్రం- కర్ణాటక ప్రభుత్వం మధ్య పరస్పర ఆరోపణలు;
By : 435
Update: 2025-01-22 11:07 GMT
కేంద్ర బడ్జెట్ ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే కర్ణాటకలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పై రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో రైళ్ల నెట్వర్క్ ను విస్తరించేందుకు కావాల్సినంత నిధులను కేటాయించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
అయితే తమతో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆరోపణలు. లేదు లేదు గత దశాబ్ధకాలంగా మీరే(కేంద్రం) తక్కువ నిధులు కేటాయిస్తున్నారని సిద్ధరామయ్య సర్కార్ వాదన.
ప్రభావమైన ప్రాజెక్ట్ లు
ఆగ్నేయ రైల్వేలోని హుబ్బళ్లి, బెంగళూర్, మైసూర్ డివిజన్లలోని కర్ణాటకలో 13 ప్రాజెక్ట్ లు సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. అలాగే గడగ్- వాడి, తుమకూర్ - దావణగెరె, తుమకూర్- రాయదుర్గం, బాగల్ కోట్ - కుడచి, శివమొగ్గ- శికారిపుర- రాణేబెన్నూర్, బెల్గాం- ధర్వాడ్ రైల్వేలైన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని రైల్వై లైన్లు కొన్ని దశాబ్ధాలుగా అసంపూర్తిగా ఉన్నాయి. కేంద్రం - కర్ణాటక మధ్య నెలకొని ఉన్న విభేదాలే వీటి పూర్తి చేసేందుకు పెద్ద అడ్డంకిగా కనిపిస్తున్నాయి.
సమన్వయ లోపం...
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు- రైల్వే అధికారుల మధ్య తీవ్రమైన సమన్వయమైన లోపం కనిపిస్తోంది. భూసేకరణలో జాప్యమే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడానికి కారణమని సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ వర్గాలు చెబుతున్న మాట. ‘‘రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఆగ్నేయ రైల్వే కేటాయించిన నిధులతో ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది’’ అని జోనల్ రైల్వే మంత్రి మంజునాథ కనమడి ‘ఫెడరల్’ తో అన్నారు.
త్వరితగతిన భూసేకరణతో గడగ్ - వాడీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 45. 5 కిలోమీటర్లు రాయచూరు, యాదగిరి, కలబురిగి జిల్లాల్లో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని కనమాడి తెలిపారు. భూసేకరణ పూర్తి చేయడానికి ఐఏఎస్ ర్యాంక్ ఉన్న అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం అలా చేయడంలో విఫలమవడంతో ప్రాజెక్ట్ లు ఇప్పుడూ ఈ దశలో పెండింగ్ లో ఉన్నాయని చెప్పారాయన.
లైన్ల బదిలీ..
కేంద్ర ప్రభుత్వ తప్పిదాలతో పాటు కమీషన్లు కూడా ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. రాయచూర్, యాద్గిర్ రైల్వే లైన్లను విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వే కి బదిలీ చేసేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకోవడంతో కల్యాణ కర్ణాటక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇది మొన్నటి వరకూ గుంతకల్ డివిజన్ పరిధిలో ఉండేవి. కల్యాణ కర్ణాటక ప్రాంత వాసులు 40 ఏళ్లుగా కలబురగి రైల్వే డివిజన్ ను కోరుతున్నారు. ఇందులో రాయచూర్, యాద్గిర్ రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. యూపీఏ 2.0 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2014 ప్రారంభంలో దీన్ని మంజూరుచేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మే 2014 లో దీన్ని రద్దుచేశారు.
రైల్వే మంత్రి ఏమంటున్నారు..
ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ కు శంకుస్థాపన చేశారు. దీనిపై రాయచూర్ ఎంపీ జీ కుమార్ నాయక్ ‘ఫెడరల్’ తో మాట్లాడారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనది. కొత్త జోన్ అయిన ఎస్సీఆర్ కి రెండు లైన్ల బదిలీకి వ్యతిరేకంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు చేసిన విజ్ఞప్తులు అసలు పట్టించుకున్న దాఖలా లేదు. మేము ఈ చర్యను వ్యతిరేకిస్తున్నామన్నారు.
కర్ణాటక రాష్ట్రాన్ని ఉత్తర భారతంతో కలిపే 13 రైళ్లు యాద్గిర్ పట్టణంలో ఆపడం లేదని మరో ఫిర్యాదు ఉంది. అలాగే హరోహళ్లి, కనకపుర, మలవల్లి, కొల్లేగల మీదుగా 141 కిలోమీటర్ల చామరాజనగర్ రైలుమార్గాన్ని రైలు మార్గాన్ని పూర్తిచేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం 1700 ఎకరాల భూమి అవసరం. హెచ్ డీ దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది.
విరుద్ద ప్రకటనలు..
చాలా రోజులుగా మా విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవట్లేదని బెంగళూర్ రూరల్ మాజీ ఎంపీ డీకే సురేష్ అన్నారు. బెంగళూర్ - మైసూర్ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను వేగవంతం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను అభ్యర్థించినట్లు కేంద్రమంత్రి హెచ్ డీ కుమార స్వామి కోరినట్లు, దానికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత పై ఫిర్యాదులు చేస్తుంటే బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్ర రూ. 1200 కోట్లతో శివమొగ్గ- శికారిపుర- రాణిబెన్నూర్ రైలు మార్గం పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు.
కేంద్రం- కర్ణాటక ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి సిద్ధరామయ్య సర్కార్ పై వివక్ష చూపెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం రైల్వేల కోసమే 2024- 25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకకు రూ. 7,559 కోట్లు విడుదల చేశామని సీతారామన్ చెప్పారు.
3,840 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ లు వేయడానికి 31 ప్రాజెక్ట్ లు జరుగుతున్నాయని, దానికి రూ. 47,106 కోట్లు అవసరమని చెప్పారు. అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సరిపోవని రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ ప్రాజెక్ట్ ల కోసం మరిన్ని నిధులు కేటాయించాలని ఆశిస్తున్నామని ఆయన ఫెడరల్ తో మాట్లాడుతూ చెప్పారు.
మంత్రి హమీలు..
వి. సోమన్న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అయ్యాక ఆయన నుంచి కర్ణాటక చాలా ఆశించింది. క్రాంతివీర సంగొల్లి రాయన్న సిటీ రైల్వే స్టేషన్ రూ. 1200 కోట్లతో పీపీపీ మోడల్ లో అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. జూలై 2024 వరకూ రాష్ట్రంలోని 1264 కిలోమీటర్ల మేర రైల్వే నెట్ వర్క్ కవర్ చేసే తొమ్మిది ముఖ్యమైన ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని సోమన్న హమీ ఇచ్చారు.
కర్ణాటకను తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్రలతో అనుసంధానం చేసేందుకు కీలకమైన మంగళూర్, కార్వార్ సెక్షన్ లను నిర్లక్ష్యం చేసినందుకు చింతిస్తూ సమగ్ర బ్లూప్రింట్ రూపొందిస్తామని సోమన్న హమీ ఇచ్చారు. దక్షిణ కన్నడ ప్రాంతంలో మూడు రైల్వే జోన్లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. అయితే గత ఏడు నెలల్లో కనీసం ఒక్క హమీ కూడా అమలు కాలేదు.