వక్ఫ్ పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు

అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 9 పిటీషన్లు దాఖలు.. ఇంతకు వేసిన వారెవరు?;

Update: 2025-04-10 08:18 GMT

ఇటీవల ఆమోదించిన వక్ఫ్ (సవరణ) (Waqf Amendment Act) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) ఏప్రిల్ 16న విచారించనుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా మొత్తం తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది.

పిటీషనర్లు ఎవరు?

వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ పిటీషన్లు వేసిన వారిలో.. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, పౌర హక్కుల పరిరక్షణ సంఘం, జమియత్ ఉలేమా-ఐ-హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ కడారి, తైయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ కుమార్, మహ్మద్ కుమార్, మహ్మద్ కుమార్, మహ్మద్ షఫీ ఉన్నారు.

అసలు ఈ బిల్లు ఎందుకు?

వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

విపక్షాల ఆందోళనల నడుమే వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లును ఏప్రిల్ 2న కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 8 గంటల పాటు చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 543 సభ్యుల్లో 288 అనుకూలంగా, 232 ప్రతికూలంగా ఓటు వేశారు. అనంతరం బిల్లు రాజ్యసభకు చేరింది. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. ఏప్రిల్ 4న తెల్లవారుజామున బిల్లును ఆమోదం పొందింది.

మొత్తం 250 సభ్యులలో..128 సభ్యులు అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. చివరకు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరడంతో ఆమె ఆమోద ముద్ర వేసింది. 

Tags:    

Similar News