రాహుల్ డిమాండ్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓకే చేస్తారా?
రాయ్‌బరేలీ ప్రజల చిరకాల డిమాండ్ ఏమిటి?;
Update: 2025-09-05 07:42 GMT
కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw)కు లేఖ రాశారు. దిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) ట్రైన్‌ను రాయ్‌బరేలీ జంక్షన్‌లో ఆపాలని అందులో కోరారు. తన నియోజకవర్గ ప్రజలు దేశ రాజధానికి వెళ్లేందుకు వీలుగా రాయ్‌బరేలీ మీదుగా వైళ్లే రైళ్లను (నంబర్లు 20503/20504, 20505/20506) ఆపాలని లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
"ఈ విషయాన్ని నా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాని స్పందించలేదు. ఇకనైనా వారి డిమాండ్‌ను నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అని సెప్టెంబర్ 3న రైల్వే మంత్రికి రాసిన లేఖలో కోరారు.