పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, రాజ్యసభ సమావేశాలు జూన్ 27న ప్రారంభం కానున్నాయి.

Update: 2024-06-27 07:30 GMT

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ రాజ్యసభ నుద్దేశించి ప్రసంగించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, రాజ్యసభ సమావేశాలు జూన్ 27న ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రభుత్వం తన కార్యక్రమాలు, విధానాలను వివరిస్తుంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే ఐదేళ్లలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తుంది. అనంతరం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

ముర్ము గత పదేళ్లలో మోదీ ప్రభుత్వ విధానాలను, ఆర్థిక వ్యవస్థ, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు సాంఘిక సంక్షేమం వంటి వివిధ రంగాలలో సాధించిన విజయాలను వివరిస్తారని భావిస్తున్నారు.

NEET-UG అక్రమాలు, UGC-NET రద్దు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు, దేశంలో రైలు ప్రమాదాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లాంటి సమస్యలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందని భావిస్తున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికార BJP నేతృత్వంలోని NDA 293 స్థానాలను గెలుచుకుని వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. 

Tags:    

Similar News