ఎన్‌టీఏను మందలించిన సుప్రీం..

నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ, గ్రేస్ మార్కులు కలపడంపై విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Update: 2024-06-18 08:14 GMT

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ ఏడాది నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఫలితాలు వెలువడ్డాక 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు.

"0.001% నిర్లక్ష్యం ఉన్నాకూడా..పూర్తిగా పరిష్కరించాలి" అని జూన్ 18న సుప్రీంకోర్టు (SC) పేర్కొంది. పరీక్ష నిర్వహించే ఏజెన్సీ "న్యాయంగా వ్యవహరించాలి" అని సూచించింది.

"తప్పు ఉంటే అవును అని చెప్పండి. పొరపాటు జరిగింది. మేం ఫలనా చర్య తీసుకోబోతున్నాం అని చెప్పండి" అని సుప్రీం కోర్టు NTAని మందలించింది.

571 నగరాల్లో పరీక్ష కేంద్రాలు..

వైద్య కోర్సులో ప్రవేశానికి మే 5న దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 571 నగరాల్లోని 4,750 కేంద్రాలలో ఎంట్రెన్స్ టెస్టు జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి.

విచారణ జూలై 8కి వాయిదా..

1,563 మంది అభ్యర్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు గత వారం NTA సుప్రీం కోర్టుకు తెలిపింది. అభ్యర్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఈ కేసు విచారణ జూలై 8కి వాయిదా పడింది.

Tags:    

Similar News