కేరళను భయపెడుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబియా..

కేరళలో చిన్నారులు బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయారు.

Update: 2024-07-06 13:32 GMT

కేరళలో చిన్నారులు బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తాజాగా ఉత్తర కేరళ పయోలిలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలుడు ఇన్‌ఫెక్షన్ బారినపడ్డాడు. ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా గుర్తించి విదేశాల నుంచి తెప్పించిన మందుల వాడడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యుడు తెలిపారు.

‘‘కలుషిత నీటిలో జీవించే అమీబా బ్యాక్టీరియా వల్ల అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వస్తుంది. ఇది అరుదైన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్. కేరళలో ఈ తరహా కేసులు మే నుంచి నమోదవుతున్నాయి. ఇప్పటికవరకూ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డ వారంతా పిల్లలే. ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం 14 ఏళ్ల బాలుడికి చికిత్స చేస్తున్నాం. ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా గుర్తించి, విదేశాల నుంచి తెప్పించిన మందుల వాడడం వల్ల ప్రాణాపాయం తప్పింది’’ అని వైద్యుడు తెలిపారు.

ఈ పరాన్నజీవి ముక్కు ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లినపుడు నోస్ క్లిప్‌లు ధరించాలని చెబుతున్నారు. క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్‌లో మాత్రమే ఈతకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఈ తరహా కేసులు గతంలో 2023, 2017లో రాష్ట్రంలోని తీరప్రాంత అలప్పుజా జిల్లాలో నమోదయ్యాయి. 

Tags:    

Similar News