Delhi Polls | ‘కాంగ్రెస్, బీజేపీ 'జుగల్బంది'ని బయటపెడతాం’

తనను ఓడించేందుకు హస్తం, కమలం పార్టీలు చేతులు కలిపాయని, ఆ విషయాన్ని ఎన్నికల్లో బయటపెడతానన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్;

Update: 2025-01-14 08:57 GMT

దేశ రాజధానిలో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ నేతల విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. హస్తం(Congress), కమలం (BJP) పార్టీ బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఆ రెండు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ‘జుగల్బంది’ (Jugalbandi)ని బహిర్గతం చేస్తామన్నారు. రాహుల్ గురించి ఒక లైన్ రాసినా.. బీజేపీ నుండి స్పందస్తోందని విమర్శించారు.

దేశాన్ని రక్షించడమే లక్ష్యం ..

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలపై కేజ్రీవాల్ స్పందించారు. "రాహుల్ గాంధీ నన్ను దూషించారు. కానీ నేను ఆయన వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వను. ఆయన కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేను దేశాన్ని రక్షించడానికి పోరాడుతున్నా," అని పేర్కొన్నారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా కౌంటర్.. "ముందుగా మీ న్యూఢిల్లీ స్థానాన్ని రక్షించుకోండి, తర్వాత దేశం గురించి ఆలోచించండి," అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

కేజ్రీవాల్‌నుద్దేశించి రాహుల్..

జనవరి 13న సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఢిల్లీని శుభ్రం చేయడం, అవినీతి తొలగించడం, పారిస్‌లా అభివృద్ధి చేయడం వంటి వాగ్దానాలు నెరవేరలేదని కేజ్రీవాల్‌నుద్దేశించి విమర్శించారు. కాలుష్యం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని, అవినీతి తగ్గిందా? అని ఆయన ప్రశ్నించారు.

కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. 

Tags:    

Similar News