ముంబైలో థాకరే సోదరుల కలయిక..

రెండు దశాబ్దాల తర్వాత కలిసిపోయిన సోదరులు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే..;

Update: 2025-07-05 12:48 GMT

మహారాష్ట్ర(Maharashtra)లో 20 ఏళ్ల కిత్రం విడిపోయిన సోదరులు ఉద్ధవ్ ఠాక్రే (Uddav Thackeray), రాజ్ ఠాక్రే (Raj Thackeray) మళ్లీ ఒకే వేదికపై కనిపించారు. ‘‘మేం కలిసి ఉండటానికే కలిసి వచ్చాం. మరాఠీని కాపాడుకోడానికి ఏకమయ్యాం’’ అంటూ మహాయుతి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రాథమిక పాఠశాలల్లో హిందీని "తప్పనిసరి" చేయడాన్ని శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో జూన్ 17న హిందీని ఆపన్షల్ భాషగా పేర్కొంటూ మరో జీవో జారీ చేసింది. ఇది తమ ఘనతేనని ప్రకటించుకున్న ఠాక్రే సోదరులు సెంట్రల్ ముంబై వర్లిలోని NSCI డోమ్‌‌లో 'ఆవాజ్ మరాఠీచా' పేరిట విజయోత్సవ సభ నిర్వహించారు. ఇద్దరూ పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ కలయిన త్వరలో జరగున్న బీఎంసీ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని జరిగిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఠాక్రే సోదరుల ప్రసంగాల్లో 10 ముఖ్యాంశాలు..

• దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కలిసిన ఆనందంలో ఉద్ధవ్ థాకరే ఇలా అన్నారు..“మేము కలిసి ఉండటానికి కలిసి వచ్చాం. మరాఠీని రక్షించడానికి ఏకమయ్యాం. మా కలయిక ట్రైలర్ మాత్రమే”.

• హిందీ భాషను థర్డ్ ల్యాంగ్వేజ్‌గా చేర్చాలన్న మహాయుతి ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ..“హిందూ, హిందూస్థాన్ ఆమోదయోగ్యమైనవి. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే సహించం.

• పాలక మహాయుతి ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఎగతాళి చేస్తూ.. ‘‘నేను పుష్ప సినిమా చూశాను. నాక్కూడా అతనిలాంటి గడ్డం ఉంటే.. నేను కూడా ' जुका నహీ సాలా ' అని అనేవాడ్ని.

• “గుజరాత్‌లో పటేళ్లను గుర్తించారు. మిగిలిన వారిని ఓటు బ్యాంకుగా మార్చారు. హర్యానాలో జాట్‌లను రెచ్చగొట్టారు. ఇతరులు కూడా అదేపని చేశారు,” అని అన్నారు.

గత సంవత్సరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ చేసిన ' బటేంగే తో కటేంగే ' నినాదానికి ఉద్ధవ్ ఇలా కౌంటర్ ఇచ్చారు. “' బటేంగే తో కటేంగే ' అంటే నిజంగా ఏమిటో ఇప్పుడు మనకు అర్థమైంది,” అని అన్నారు.

• మరాఠీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ తిరుగుబాటు స్వరంతో ఉద్ధవ్ ఇలా అన్నారు. “అవును, మేము గూండాలే. న్యాయం కోసం అవసరమైతే గుండాగిరి చేస్తాం,” అని ప్రకటించారు. మరాఠీలో మాట్లాడనందుకు రాజ్ మద్దతుదారులు.. వీధి వ్యాపారులను చెంపదెబ్బ కొట్టి బెదిరించారని వచ్చిన విమర్శలకు ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

• “బాల్ థాకరే చేయలేని పని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేశారు. మమ్మల్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. మీకు విధాన భవన్‌లో అధికారం ఉండొచ్చు. కానీ వీధుల్లో అధికారం ఉంది.’’ అని రాజ్ థాకరే అన్నారు.

• “ఈ మూడు భాషల సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నేడు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కార్యకలాపాలు పూర్తిగా ఇంగ్లీషులోనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో ఇది జరగడం లేదు. మహారాష్ట్రలో మాత్రమే ఎందుకు?’’ అని రాజ్ థాకరే ప్రశ్నించారు.

• “హిందీ కేవలం 200 ఏళ్ల నాటి భాష. ముంబై లేదా మహారాష్ట్రపై చేయి వేసి చూడండి..దాని పరిణామాలు మీరే చూస్తారు” అని రాజ్ హెచ్చరించారు.

• “మంత్రి దాదా భూసే నా దగ్గరికి వచ్చి తన మాట వినమని అడిగారు. నేను అతనితో చెప్పా.. 'నేను వింటాను. కానీ సమ్మతించను' అని చెప్పా. "ఉత్తర ప్రదేశ్, బీహార్ లేదా రాజస్థాన్‌లో మూడో భాష ఏది? అని నేను అతనిని అడిగా? హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నీ మనకంటే వెనుకబడి ఉన్నాయి. అయినప్పటికీ మనమే హిందీ నేర్చుకోవలసి వస్తుంది. ఎందుకు?" అని రాజ్‌ థాకరే ప్రశ్నించారు.

• “మనం హిందీకి అంగీకరించి ఉంటే..ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం జరిగేది’’

Tags:    

Similar News